Switch to English

అఖండ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.90 )

No votes so far! Be the first to rate this post.

91,427FansLike
56,277FollowersFollow
Movie అఖండ
Star Cast నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు
Director బోయపాటి శ్రీను
Producer మిర్యాల రవీందర్‌రెడ్డి
Music త‌మన్‌ ఎస్‌‌‌
Run Time 2 hr 48 Mins
Release డిసెంబర్ 02, 2021

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరి అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ:

మురళీ కృష్ణ (బాలకృష్ణ) ఒక సామాజికవేత్త. తన చుట్టూ ఉన్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాంటివారినైనా ఎదిరిస్తాడు. అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకర సంఘటన కారణంగా ఒక ల్యాండ్ మైనింగ్ ప్రాజెక్ట్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయని తెలిసి ఎదురుతిరుగుతాడు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఒక మినిస్టర్ హత్యకేసులో నిందితుడిగా మురళీ కృష్ణను పేర్కొంటారు. రంగంలోకి ఎన్ఐఏ దిగుతుంది.

పరిస్థితులు పూర్తిగా చేజారుతున్న క్రమంలో రంగంలోకి అఖండ (బాలకృష్ణ) వస్తాడు. ప్రజల ప్రాణాలను, తనవారి ప్రాణాలను అఖండ కాపాడగలడా? మురళీ కృష్ణకు, అఖండకు ఉన్న సంబంధమేంటి?

నటీనటులు:

బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు. అందులో మొదటిది సామాజికవేత్త పాత్ర. ఆ రోల్ లో ఎప్పట్లానే దూసుకుపోయాడు. తన స్వాగ్, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. అయితే ప్రత్యేకంగా నిలిచేది మాత్రం అఘోరా గెటప్ ఉన్న పాత్రే. తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు బాలయ్య. బాడీ లాంగ్వేజ్ కానీ డిక్షన్ కానీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మాస్ ఆడియన్స్ కు ఈ రోల్ ఫుల్ మీల్స్ ను అందిస్తుంది.

ప్రగ్యా జైస్వాల్ చూడటానికి బాగుంది. ఆమె ప్రత్యేకంగా చేయడానికంటూ ఏం లేదు. ప్రతీ బోయపాటి మూవీ హీరోయిన్ రోల్ నే ఆమె కూడా చేసింది. సెకండ్ హాఫ్ అంతా అయితే ఏడవడం, లేదా పరిగెత్తడంతోనే సరిపోయింది. విలాన్ గా శ్రీకాంత్ పాత్ర పర్వాలేదు. శ్రీకాంత్ బాగానే చేసినా ఆ పాత్ర పరిధి ఒక లెవెల్ కు మించి వెళ్ళలేదు. పూర్ణ, జగపతి బాబులవి చిన్న పాత్రలే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.

సాంకేతిక వర్గం:

బాలకృష్ణతో పనిచేసేటప్పుడు బోయపాటి స్పెషల్ టాలెంట్ ను బయటకు తీస్తాడనిపిస్తుంది. సింహా, లెజండ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సాధారణంగానే అఖండపై అంచనాలు పెరుగుతాయి. ఒక రొటీన్ కథకు తనదైన శైలి మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో లాగిద్దామనుకున్నాడు. అయితే ఓపెనింగ్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ తప్ప మిగతావన్నీ చొప్పించినట్లు అనిపిస్తాయి. కథలో భాగంగా రావు. మొత్తం 8-9 భారీ యాక్షన్ సన్నివేశాలతో ఒకానొక సమయంలో మొహం మొత్తేస్తుంది. అఘోర ట్రాక్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి కానీ సినిమాలో ఓ మాదిరిగానే అనిపిస్తుంది. సినిమా ఫ్లో కన్సిస్టెంట్ గా ఉండదు. ఒక హై ఎపిసోడ్ వస్తే వెంటనే డల్ బ్లాక్ తో గ్రాఫ్ కింద పడిపోతుంది. మళ్ళీ ఒక పవర్ఫుల్ సీన్ తో పైకి లేస్తుంది. ఇక క్లైమాక్స్ లో లాజిక్ గురించి పట్టించుకోకుండా సెన్స్ లెస్ గా గూస్ బంప్స్ తెప్పించుకోవడమే.

థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ బాగా పెరిగింది అయితే మాస్ ప్రేక్షకులకు మాత్రం విందులా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ క్వాలిటీల ఉంది. ఎడిటింగ్ పరంగా చాలా ల్యాగ్ సీన్స్ ను తీసేయొచ్చు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ప్లస్ పాయింట్స్:

  • బాలకృష్ణ పెర్ఫార్మన్స్
  • రెండు యాక్షన్ బ్లాక్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • ల్యాగ్ సన్నివేశాలు
  • క్లైమాక్స్

విశ్లేషణ: ప్రతీ 15 నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు మినహా బోయపాటి ఈ చిత్రంలో సరైన ఎమోషన్ ను నింపడంలో ఆ యాక్షన్ బ్లాక్స్ కు మంచి లీడ్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. మొత్తంగా బాలయ్య, థమన్ ల కోసం ఒకసారి చూడొచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.5/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

దివి పాప టైట్ డ్రెస్ లో ఎంతగా అందాలు చూపిస్తుందో చూడండి

తెలుగు బిగ్‌ బాస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. బిగ్‌ బాస్ కి ముందు చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ ఒక్కటి కూడా ఈమెకు గుర్తింపు తెచ్చి...

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

కప్పులో పప్పు రేవంత్.! ఐటమ్ బాంబ్ ఆర్జే సూర్య.!

సమంత వేస్టు.. ఆర్జే సూర్య తోపు.! అనవసరంగా కోట్లు వెచ్చించి సమంతతో ‘పుష్ప ది రైజ్’ సినిమాలో సుకుమార్ ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేయించినట్లున్నాడు. హీరోల్లా మాట్లాడటమే...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఒరిస్సా కు చెందిన కృష్ణ...

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ...