“మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి”: బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ భావోద్వేగంగా స్పందించారు.

“చెన్నైలో పుట్టినందుకు ఇది నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి” అని ఆయన అన్నారు.

‘అఖండ 2’ గురించి మాట్లాడుతూ—
“ఈ చిత్రాన్ని 130 రోజుల్లో, వివిధ దేశాల్లో అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇలాంటి సినిమా సాధ్యం కాదు. సనాతన హైందవ ధర్మం చెప్పిన ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అనే సందేశం ఈ చిత్రంలో కనిపిస్తుంది. భవిష్యత్ తరాలు సనాతన ధర్మం గురించి ఈ సినిమాతో నేర్చుకుంటాయి. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటి చిత్రం” అని చెప్పారు.

తన కెరీర్‌పై మాట్లాడుతూ—
“ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతున్నా, ఇంకా హీరోగా కొనసాగడం నా తల్లితండ్రులు, అభిమానుల ఆశీస్సు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్— అన్నీ హిట్ . ‘అఖండ 2’ కూడా ఆ విజయయాత్రలో చేరుతుంది” అని ధైర్యంగా ప్రకటించారు.

కరోనా సమయంలో ‘అఖండ’ చేసిన కలకలం గురించి ప్రస్తావిస్తూ—
“ఆ సమయంలో భయపడకుండా విడుదలై ఘన విజయాన్ని సాధించిన మొదటి భారతీయ చిత్రం ‘అఖండ’. ఆ తర్వాతే మిగతా సినిమాలకు దారి తీయబడింది. బోయపాటి – మా కాంబినేషన్ సింహ, లెజెండ్, అఖండ— అన్నీ బ్లాక్ బస్టర్స్ . ఈ సినిమాతో కూడా అదే మాయ కొనసాగుతుంది” అన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ—
“‘అఖండ’ రీజినల్ సినిమా కాదు, ఇండియన్ సినిమా. అదే రీతిగా ‘అఖండ 2’ భారతదేశ ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం ఆడియన్స్‌ను కమర్షియల్‌గా ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. పరమశివుడు స్వయంగా వచ్చి దేశం, ధర్మం, దైవం, వేదం గురించి ఒక పవిత్రమైన సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ సందేశాన్ని పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పాం” అని తెలిపారు.

ప్రెస్ మీట్ తర్వాత సినిమా పై హైప్ మరింత పెరిగింది. డిసెంబర్ 5న ప్రేక్షకులు ‘అఖండ 2: తాండవం’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

‘పెద్ది’ హవా మామూలు కాదు.. బుకింగ్స్‌తోనే కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న రామ్ చరణ్ సినిమా!

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

Daily Horoscope: ధనుస్సు వారికి ఆర్థిక లాభాలు.. మీన రాశివారికి శుభవార్తలు

మే 8, 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....