మాస్ మంత్రం, భక్తి వైభవం కలగలిపిన ‘అఖండ 2: ది తాండవం’ టీజర్ ప్రేక్షకుల్లో ఆతృతను మరింత పెంచింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానున్న ఈ చిత్రం కోసం 11 న ప్రీమియర్లు ప్లాన్ చేశారు. తాజాగా విడుదలైన గ్రాండ్ రిలీజ్ టీజర్ అఖండ ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకువస్తూ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
టీజర్ ప్రారంభం నుండి చివరి వరకు అఖండ శక్తి, ఆధ్యాత్మిక వైభవం, ఉగ్ర రూపం స్పష్టంగా కనిపించాయి. భక్తి శక్తిగా మారే అఖండ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా కనిపించగా, యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. శివతాండవం నేపథ్యమైన విజువల్స్, ఘోరమైన యుద్ధ దృశ్యాలు, దైవిక శక్తుల ప్రతిభింబాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటున్నాయి.
తాంత్రిక వాతావరణం, కుంభమేళా సెట్టింగ్స్ గ్లింప్స్ టీజర్‌కు ప్రత్యేకమైన మిస్టిక్ ఫీలింగ్‌ని ఇచ్చాయి. ప్రతి షాట్‌లో ఆధ్యాత్మికతతో పాటు మాస్ ఎమోషన్ తిరగబడే విధంగా ఉండటం విశేషం. మొత్తం టీజర్ భారీ స్కేల్, హై ఎండ్ విజువల్స్‌తో అఖండ ప్రపంచాన్ని మరింత బలంగా చూపించింది.
ఇక బుకింగ్స్ విషయానికి వస్తే… BookMyShow లో ఇప్పటికే టికెట్ అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్‌టైమ్ హై రేంజ్‌లో ఉండటంతో ‘అఖండ 2’ మామూలు ఓపెనింగ్ రాబోదని స్పష్టమవుతోంది. టికెటింగ్ పోర్టల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్ వైపు దూసుకెళ్తోంది.
