బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ రానే వచ్చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది. మొదటి పార్టుకు సీక్వెల్ గా వచ్చిన రెండో పార్టు టీజర్ అనుకున్నట్టుగానే మాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేశారు. మంచులో ఫైట్ సీన్ లో టీజర్ ను మొదలు పెట్టారు. ఇందులో నాగసాధుగా బాలయ్య లుక్ భయపెట్టేలా ఉంది.
భారీ గడ్డం, జుంపాలతో నాగసాధు లుక్ లోకి మారిపోయారు. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పే విధానం బాగుంది. త్రిశూలంతో శత్రువులను అంతం చేసే సీన్ బాగానే ఉంది. ‘వేదాలు చదివిన స్వరం యుద్ధానికి ఎదిగింది’ అంటూ బాలయ్య పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. తమన్ ఇచ్చిన బీజీఎం ఆకట్టుకుంటోంది. కేవలం బాలయ్య నాగసాధు పాత్రను మాత్రమే ఇందులో చూపించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలయ్య కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు.
