జనరల్ గా హీరోయిన్స్ విషయంలో పలు రకాల వార్తలు షికారు చేయడం సినిమా రంగంలో సాధారణ విషయమే. ఫలానా హీరోయిన్ ప్రేమలో ఉందంట. ఫలానా హీరోయిన్ ఆ హీరోతో డేటింగ్ చేస్తుందంటూ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా తెలుగు పిల్ల ఐశ్వర్య రాజేష్ విషయంలో కూడా అలాంటి వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు జోరు ప్రేమాయణంలో ఉందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది? ఈ విషయం గురించి తెల్సుకున్న ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
తన పెళ్లి, ప్రేమలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరో నాకు చెప్పండి, అతడి గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉందంటూ సెటైర్ వేస్తూ కామెంట్ పెట్టింది. తన విషయంలో ఇప్పటివరకు ప్రేమ, పెళ్లి విషయంలో ఏమి ఆలోచించలేదని, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందంటూ తెలిపింది. తప్పకుండా పెళ్లి చేసుకునే సమయం వస్తే నేనే మీకు స్వయంగా తెలియచేస్తా .. ఎవరిని పెళ్లి చేసుకుంటానో! అంటూ కాస్త సీరియస్ గానే చెప్పింది. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను .. అదికూడా సింగిల్ గానే ఉన్నానంటూ హింట్ కూడా ఇచ్చింది ?
సింగిల్ గా ఉన్నానంటూ చెప్పడంతో ఈమె కావాలని చెప్పిందా లేక నేను సింగిల్ గా ఉన్నానంటూ హింట్ ఇచ్చిందా అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తెలుగు పిల్ల ఐశ్వర్య రాజేష్ .. కోలీవుడ్ లో బాగానే సెటిల్ అయింది. గ్లామర్ కంటే కూడా నటనపై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు క్యూ కడుతున్నాయి.