ఈ సంక్రాంతి పండుగకు వస్తున్న సినిమాల్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. విక్టరీ వెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 14న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ మూవీలో యాక్ట్ చేయాలని డైరెక్టర్ అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను.
స్క్రిప్టు చెప్పేటప్పుడే చాలా నవ్వుకున్నాను. ఇక మూవీ చూస్తే మీరు కూడా అంతే నవ్వుకుంటారు. భాగ్యం పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారు. చివరకు ఆ అవకాశం నాకు దక్కింది అంటూ తెలిపింది ఐశ్వర్య. గోదారి గట్టు పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాటతో అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. వెంకటేశ్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఎనర్జీతో సెట్ లో అందరినీ నవ్విస్తుంటారు. వెంకటేశ్ ఎమోషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఆయన టైమింగ్ తో యాక్ట్ చేయడం చాలా కష్టం. కానీ వెంకటేశ్, అనిల్ రావిపూడి చాలా సపోర్టు చేశారు. వారి సపోర్టు వల్లే ఈ సినిమాలో అంత అద్భుతంగా నటించాను.
భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాత్ర. అందరూ ఆ పాత్రకు కనెక్ట్ అయిపోతారు. మీనాక్షి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం. దిల్ రాజు నిర్మాణంలో చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది నాకు. ఈ సినిమా కచ్చితంగా మంచి పండగ సినిమా అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్.