ఐశ్వర్యరాయ్ విడాకులు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. కానీ దీనిపై వాళ్లు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ రూమర్లు మాత్రం అస్సలు ఆగట్లేదు. అటు బాలీవుడ్ మీడియాలో కూడా బాగానే వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు బచ్చన్ ఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. కాగా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా దీనిపైనే క్రిటిక్స్ కూడా కథనాలు రాస్తున్నారు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ కూడా పరోక్షంగా స్పందించారు. నిజాలు తెలియని వాళ్లే ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తారు.
అబద్దపు ప్రచారాలు ఎప్పటకీ అబద్దాలుగానే మిగిలిపోతాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయినా సరే రూమర్లకు మాత్రం చెక్ పడలేదు. ఇక తాజాగా ఐశ్వర్య రాయ్ దుబాయ్ లోని ప్రత్యేక మహిళా సదస్సులో పాల్గొంది. అయితే ఈ ఈవెంట్ లో ఆమె పేరు పక్కన బచ్చన్ అనేది లేదు. కేవలం ఐశ్వర్య రాయ్ అని మాత్రమే ఉంది. దాంతో ఈ రూమర్లు మరోసారి జోరుగా వినిపిస్తున్నాయి. ఐశ్వర్య నిజంగానే విడాకులు తీసుకుంటుందేమో అంటున్నారు. ఇన్ని సార్లు రూమర్లు వచ్చినా వారు స్పందించట్లేదు అంటే నిజమే అంటున్నారు.
ఒకవేళ నిజంగానే కలిసి ఉంటే ఈ రూమర్లకు చెక్ పెట్టొచ్చు కదా. అలా చేయకుండా రూమర్లకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఐశ్వర్య రాయ్ అభిమానులు.