Switch to English

ఆహా రిలీజ్: ‘అర్ధ శతాబ్దం’ మూవీ రివ్యూ

Movie అర్ధ శతాబ్దం
Star Cast కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్
Director రవీంద్ర పుల్లే
Producer కిరణ్ రామోజు - రాధాకృష్ణ
Music నఫల్ రాజా ఐస్
Run Time 1 గంట 57 నిమిషాలు
Release జూన్ 11, 2021

ఆహాలో అర్ధ శతాబ్దం మూవీ చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘C/O కంచరపాలెం’ సినిమాతో నటుడిగా పరిచయమైన కార్తీక్ రత్నం హీరోగా, కృష్ణ ప్రియ హీరోయిన్ గా పరిచయం అవుతూ, దర్శకుడిగా రవీంద్ర పుల్లే చేసిన తొలి ప్రయత్నం ‘అర్ధ శతాబ్దం’. నవీన్ చంద్ర, సాయి కుమార్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా థియేటర్స్ స్కిప్ చేసి నేడు ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో డైరెక్ట్ గా రిలీజయ్యింది. మరి ఈ అర్ధ శతాబ్దం ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం..

కథ:

సిరిసిల్ల.. కుల గొడవలతో ఒకరినొకరు చంపుకునే గ్రామం.. ఆ ఊర్లో పుట్టిన కృష్ణ(కార్తీక్ రత్నం) చిన్నప్పటి నుంచే తనతో పాటు చుదువుకునే పుష్ప(కృష్ణ ప్రియ)ని ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమని చెప్పడానికి భయపడుతుంటాడు. ఆ ఊరి కుల వివాదాలతో పాటే కృష్ణ ప్రేమ కూడా పెద్దదవుతుంది. కానీ ఎప్పటికప్పుడు కృష్ణ పుష్పకి తన ప్రేమని చెప్పడానికి భయపడుతుంటాడు. అదే టైంలో 15 రోజుల్లో తనకి దుబాయ్ వెళ్లే ఆఫర్ వస్తుంది. దాంతో తను వెళ్లే లోపు తన ప్రేమని చెప్పాలనుకుంటాడు. ఆ క్రమంలో కృష్ణ అండ్ ఫ్రెండ్స్ ఓ తప్పు చేస్తారు. ఆ తప్పు వలన వారికే తెలియకుండా ఊరిలో కుల గొడవలు చెలరేగి ఒకరిని ఒకరు చంపేసుకుంటుంటారు. ఇంతకీ కృష్ణ అండ్ ఫ్రెండ్స్ చేసిన తప్పేంటి? ఆ గొడవల్లో ఎవరెవరు బలయ్యారు? కృష్ణ తన ప్రేమని పుష్పకి చెప్పాడా? చెప్తే పుష్ప సమాధానం ఏంటి? చివరికి కృష్ణ – పుష్ప కలిసారా? లేక ఆ గొడవల్లో బలైపోయారా? అన్నదే కథ..

తెరమీద స్టార్స్..

తెరపై కనిపించిన నటులందరూ వారి వారి పాత్రలకి న్యాయం చేశారు. కానీ పాత్రలని సరిగా తీర్చిదిద్దలేదనేది క్లియర్ గా తెలుస్తుంది. హీరోగా చేసిన కార్తీక్ రత్నం మరోసారి తన నటనతో మెప్పించాడు. తొలిపరిచయమైన కృష్ణప్రియ కూడా బాగా చేసింది. ముఖ్య పాత్రల్లో కనిపించిన నవీన్ చంద్ర, సాయి కుమార్, అజయ్, శుభలేఖ సుధాకర్ లు బాగా చేసినా, కథలో వారి పాత్రలు పరిపూర్ణంగా లేవనిపిస్తుంది.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ గా సినిమాలో కనిపించే అన్ని డిపార్ట్మెంట్స్ ది బెస్ట్ ఇచ్చాయి అందులో ప్రధమంగా వేణు, వెంకట్ ఆర్ శాఖమూరి, అస్కర్ ల సినిమాటోగ్రఫీ సూపర్బ్.. 90ల నాటి కథకి సరిపోయే విజువల్స్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ విజువల్స్ కి నఫల్ రాజా ఐస్ అందించిన మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. లవ్ సాంగ్స్ తో పాటు నేపధ్య సంగీతం కూడా బాగుంది. సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైన్ కూడా చెప్పుకోదగినదే. జె ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ మాత్రం సరిగా లేదనిపిస్తుంది. దానికి కారణం ప్రారంభం బాగున్నా మొదటి గంట సేపు ప్రేమ కథతో అక్కడే తిప్పి తిప్పి కథని సాగదీస్తే, సెకండాఫ్ లో రన్ టైం తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా లింకులు లేకుండా కట్ చేసి అతుకుల బొంతలా తయారు చేశారు. దాంతో సినిమాలో అనుకున్న ఏ ఎమోషన్ సరిగా వర్కౌట్ కాలేదు.

ఆహాలో అర్ధ శతాబ్దం మూవీ చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కెప్టెన్ అయిన రవీంద్ర పుల్లే మొదటి సినిమాకి ఎంచుకున్నది కాస్త కామన్ పాయింట్ అయినా, డీలింగ్ కి కాస్త కష్టమైన ప్రేమ కథ, అభ్యుదయం, కుల రాజకీయం.. ఇలా మూడింటిని కలిపి చెప్పేలా కథని అనుకున్నాడు. ఆ పాయింట్ కి అనుగుణంగా బ్యాక్ డ్రాప్ కూడా స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్ళు గడిచిన కాలాన్ని, అప్పటి ప్రజాస్వామ్య సమస్యలని ఎంచుకున్నాడు. అంతవరకూ బాగుంది కానీ అనుకున్న పాయింట్ ని కథగా రూపొందించడంలో ఫెయిల్ అయ్యాడు. అటు ప్రేమ పరంగా కానీ, కులం పరంగా కానీ సరైన పాత్రలని, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోవడంలో భారీగా విఫలమయ్యారు. దానికి తోడు కథనం కూడా చాలా స్లోగా సాగడం, ప్రేక్షకులకి నెక్స్ట్ చూడాలి అనిపించే మోమెంట్స్ లేకపోవడంతో సినిమాని మధ్యలోనే కట్టేస్తారు. ఇక దర్శకుడిగా కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ని డీల్ చేయగలిగిన సగటు ప్రేక్షకుణ్ణి మెప్పించలేకపోయాడు. డైలాగ్స్ బాగున్నా ఆకట్టుకోలేని కథలో వృథా అయిపోయాయి. కిరణ్ రామోజు – రాధాకృష్ణ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్
– స్టోరీ లైన్ అండ్ బ్యాక్ డ్రాప్
– మీనింగ్ ఫుల్ డైలాగ్స్

బోరింగ్ మోమెంట్స్:

– పాత కథ
– ఆకట్టుకోలేని కథనం
– నెమ్మదిగా సాగే నేరేషన్
– ఎమోషనల్ గా కనెక్ట్ కానీ పాత్రలు
– డైరెక్షన్
– ఎడిటింగ్

విశ్లేషణ:

మొదటి ప్రయత్నంలోనే పలు కష్టతరమైన విషయాలను మేళవించి చెప్పాలి అనుకున్న డైరెక్టర్ రవీంద్ర పుల్లే పలు అంశాలను, పలు డైలాగ్స్ ని బాగా రాసుకున్నప్పటికీ అన్నిటినీ కలిపి ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోయారు. నేటివిటీ అండ్ నిజ జీవిత కథలు ఇష్టపడే వారికి పరవాలేధనిపించినా, మిగతా వారికి అంతగా నచ్చకపోవచ్చు.

చూడాలా? వద్దా?: రియలిస్టిక్ నేటివిటీ కథాంశాలు ఇష్టపడే సినీ అభిమానులు చూడచ్చు.

ఆహాలో అర్ధ శతాబ్దం మూవీ చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

ఈ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది : రష్మిక

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని...

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...

‘నా చేతిపై ఉన్న టాటూను ఫ్యాన్స్ వేయించుకోవద్దు..’ కారణం చెప్పిన నాగచైతన్య

తన చేతిపై ఉన్న టాటూను అభిమానులు ఎవరూ వేయించుకోవద్దని టాలీవుడ్ హీరో నాగ చైతన్య కోరారు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: కౌబాయ్ పాత్రలో చిరంజీవి స్టయిలిష్ మూవీ ‘కొదమసింహం’

కెరీర్లో రెగ్యులర్ మాస్, కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేశారు చిరంజీవి. దర్శకుడు బాపు మాటల్లో.. ‘చిరంజీవి మాస్ సినిమాలకు ఎడిక్ట్ అయిపోయాడు. అది ఆయన తప్పు కాదు. చిరంజీవి సాధించిన ఇమేజ్...

మహేశ్ బర్త్ డే స్పెషల్: మహేశ్ కెరీర్.. ‘ప్రిన్స్ టు సూపర్ స్టార్’

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన మహేశ్ తండ్రి వారసత్వం నిలబెట్టారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నటనలో తానెంత చిచ్చరపిడుగో ఆనాడే నిరూపించారు. తండ్రితోనే కాకుండా సోలో హీరోగానూ...