ఇప్పుడు హీరోలను సాఫ్ట్ గా చూపించే రోజులు పోయాయి. అందులోనూ సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ వచ్చాక.. అసలు హీరోల పాత్రలకు లిమిట్స్ అనేవి లేకుండా పోయాయి. హీరోను ఎంత అగ్రెసివ్ గా చూపిస్తే.. యూత్ అంతగా కనెక్ట్ అయిపోతున్నారు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ ను గేమ్ ఛేంజర్ లో కూడా చాలా అగ్రెసివ్ గా చూపించబోతున్నాడంట డైరెక్టర్ శంకర్. ఇందుకోసం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను అలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న వచ్చిన టీజర్ లో రామ్ చరణ్ ఓ డైలాగ్ ఉంటుంది. అదే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. అయామ్ అన్ ప్రెడిక్టబుల్ అంటాడు. పైగా ఇందులో ముప్పై రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా అనే పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు రామ్ చరణ్. దాంతో ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా అగ్రెసివ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ పాత్రకు చాలా కోపం ఎక్కువ అని ఇందులో తెలిసిపోతోంది. ఈ లెక్కన సందీప్ రెడ్డిని మించి శంకర్ తన యాంగిల్ లో రామ్ చరణ్ పాత్రను యూత్ కు పిచ్చెక్కించేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఆ పాత్ర చేసే యాక్షన్ సీన్లు కూడా సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటాయని తెలుస్తోంది.
గతంలో తన సినిమాలో హీరోల పాత్రలను శంకర్ ఎంత సీరియస్ నెస్ లో చూపించేవాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు హీరో పాత్రను సీన్లకు తగ్గట్టు సీరియస్ నెస్ లో చూపించేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఎలా ఉంటుందో.
Very energgetic post, I looved that bit. Wiill there be a part 2?