తెరమీద కొన్ని జంటలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. వారిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన బజ్ ఏర్పడుతుంది. అలాంటి జంటలకు ఉన్న క్రేజ్ కోసం దర్శకులు పట్టుబట్టి మరీ వారిని ఒప్పిస్తుంటారు. అలాంటి జంటల్లో సాయిపల్లవి-దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. వీరిద్దరికీ సెపరేట్ గా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి వీరిద్దరూ మరోసారి తెరమీద జంటగా కనిపించబోతున్నారంట. రీసెంట్ గానే లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ భారీ హిట్ అందుకున్నాడు. అటు సాయిపల్లవి కూడా చాలా రోజుల తర్వాత అమరన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
ఇలా ఇద్దరూ మంచి జోష్ లో ఉన్నారు. అయితే వీరిద్దరి గురించి తాజాగా ఓ సమాచారం అందుతోంది. దుల్కర్ సల్మాన్ తర్వాత మూవీ ‘ఆకాశంలో ఒక తార’. దీన్ని గీతా ఆర్ట్స్, బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం అందుతోంది. తెరపై వీరిద్దరూ కనిపిస్తున్నారనే సమాచారంతో అప్పుడే మూవీ గురించి చర్చ జరుగుతోంది. వీరిద్దరూ గతంలో కలి అనే మలయాళ సినిమాలో నటించారు. ఆ మూవీ వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది.
అప్పటి నుంచి వీరిద్దరూ మళ్లీ కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తారని తెలియడంతో ఇరువురి ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ ఎలాంటి నెగెటివిటీ లేదు. పైగా నటనలో ఎవరికి వారే సాటి. అందుకే ఈ జంటకు ఇంత క్రేజ్.