Switch to English

టిబి స్పెషల్: లాల్ కృష్ణుడి నుంచి నరేంద్రుడి వరకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అసలు బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదం ఏమిటి? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? చివరకు ఎలా కొలిక్కి వచ్చింది? ఓసారి చూద్దాం..

త్రేతాయుగంలో అంటే దాదాపు 9 లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడన్నది హిందువుల విశ్వాసం. అనంతరం కాలంలో 1528లో బాబర్ చక్రవర్తి అక్కడ బాబ్రీ మసీదు నిర్మించారు. అయితే, మసీదు ప్రధాన డోమ్ ఉన్న కింద భాగంలో ఉండే గదే రాముడి జన్మస్థలమని పలువురి నమ్మకం ఈ నేపథ్యంలో 1885లో మహంత్ రఘుబీర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ కోర్టుకెళ్లారు. బాబ్రీ మసీదు బయట ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు దానిని తోసిపుచ్చింది.

1949 డిసెంబర్ 23వ తేదీ ఉదయం బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలు కనిపించడంతో కలకలం రేగింది. అనంతరం ఆ విగ్రహాలను పూజించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ గోపాల్ విశారద్, రామచంద్ర దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద ప్రాంతాన్ని అప్పగించాలంటూ 1959లో నిర్మోహి అఖారా పిటిషన్ దాఖలు చేసింది. మసీదులో ఉన్న విగ్రహాలను తొలగించడానికి ఆదేశాలివ్వాలంటూ 1961లో యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ వేసింది. 1986 ఫిబ్రవరిలో ఆ విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు ఫైజాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది.

1989 ఆగస్టులో ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరడంతో యథాతథ స్థితికి ఆదేశించింది. 1989 నవంబర్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం విశ్వహిందూ పరిషత్ కు వివాదాస్పద ప్రాంతంలో పూజ చేయడానికి అనుమతిచ్చింది. 1990 సెప్టెంబర్ లో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఘటనపై విచారణ జరపడానికి ప్రభుత్వం జస్టిస్ లిబర్హన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం వివాదాస్ప ప్రాంతానికి సమీపంలో ఉన్న 67 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

2002 ఏప్రిల్ లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాలపై వాదనలు వినడం ప్రారంభించింది. ఆ స్థలంలో ప్రార్థనలు చేయడంపై సుప్రీంకోర్టు 2003 మార్చిలో నిషేధం విధించింది. 2009లో జస్టిస్ లిబర్హన్ కమిటీ తన నివేదిక సమర్పించింది. 2010 సెప్టెంబర్ 30న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు అప్పగించాలని సూచించింది. దీనిపై 2011 మార్చిలో సుప్రీంకోర్టు స్టే విధించింది.

2017 ఆగస్టులో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వినడం ప్రారంభించింది. అనంతరం 2019 జనవరిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఇది బదిలీ అయింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 2019 ఆగస్టు 6న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ తగిన పరిష్కారం చూపలేకపోయింది. దీంతో మళ్లీ ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

40 రోజులపాటు వాదనలు విన్న ధర్మాసనం.. 2019 నవంబర్ 9న కీలకమైన తీర్పు వెలువరించింది. వివాదాస్పద ప్రాంతంలో రాముడి మందిరం నిర్మాణానికి అనుమతించింది. అయోధ్యలోనే తగిన ప్రదేశంలో మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని యూపీ సర్కారును ఆదేశించింది.

నిజానికి అయోధ్య వివాదంలో 1990 వరకు జరిగిన సంఘటనలు ఒక ఎత్తైతే.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మరో ఎత్తు. వివాదాస్పద ప్రాంతంలో రాముడి గుడి కట్టాలంటూ విశ్వహిందూ పరిషత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా అప్పటి బీజేపీ జాతీయ అద్యక్షుడు అద్వానీ ప్రారంభించిన రథయాత్ర దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ లో ప్రారంభమైన ఈ యాత్ర అనేక గ్రామాలలో సాగింది. అద్వానీ యాత్ర రోజుకు 300 కిలోమీటర్లకు పైగా సాగింది. కరసేవకులు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో అద్వానీ పేరు మార్మోగిపోయింది. రథయాత్ర సందర్భంగా పలుచోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బీహార్ లోని లాలూప్రసాద్ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేసింది. అయినప్పటికీ పలువురు కరసేవకులు అయోధ్య చేరుకున్నారు.

ఈ సందర్భంగా తలెత్తిన హింసలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత బాబ్రీ మసీదును ధ్వంసం చేయడంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిపి తీరతామని పలుమార్లు తమ మేనిఫెస్టోలో ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. చివరకు నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో హిందువుల చిరకాల వాంఛ నెరవేరుతోంది. అయోధ్యలో రాముడి ఆలయానికి మూడు దశాబ్దాల క్రితం అద్వానీ రోడ్డు వేయగా.. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...