టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్స్‌లో ఒకటి యువ దర్శకుడు, Little Hearts fame- సాయి మార్తాండ్ (Sai Marthand) తో ఉండగా, మరో సినిమా Girl Friend Fame- రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం. ముఖ్యంగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందే సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రం హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ఉండనుందని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ, ఈ కాంబినేషన్స్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో తన కథల ఎంపికతో విజయాలను అందుకున్న శేష్, ఈసారి కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇక అధికారిక అనౌన్స్‌మెంట్ వెలువడిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
