మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంకు తెరపడింది. శివసేన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఇవ్వడంతో రెబల్స్ కు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిందే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ సమయంలో శివసేన కీలక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఒక హోటల్ నుండి మరో హోటల్‌కు.. ఒక చోటు నుండి మరో చోటుకు ఎన్నాళ్లు పరుగులు పెడతారు. మీరు ప్రజలకు ముఖం చూపించేది ఎప్పుడు.. ఎలా అంటూ ప్రశ్నించాడు. ప్రజలు మిమ్ములను ఎలా క్షమిస్తారు అంటూ ఆదిత్య థాకరే ప్రశ్నించాడు. మీ నియోజక వర్గాలకు ఇప్పుడు కాకున్నా కొన్ని రోజుల తర్వాత అయినా వెళ్లాల్సిందే. అప్పుడు మీ మొహం ఎలా చూపిస్తారు అంటూ ఆదిత్య థాకరే చేసిన వ్యాఖ్యలకు రెబల్ ఎమ్మెల్యేల వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.