తెలుగు కామెడీ సినిమా “అది ఒక ఇదిలే” ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ పద్ధతిలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో సబ్యసాచి మిశ్రా, రాధిక ప్రీతి, శ్యామ్, మహి, తేజో వికాస్ హీరోహీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకత్వం వహించగా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ కూడా స్వర్ణ మాస్టర్ చేశారు. సంగీతం మురళీధర్ రాగి అందించారు.
ప్రేమ, స్నేహం, కామెడీ మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది. మహి, సిద్ధు, మిథున్ చిన్ననాటి మిత్రులు. ముగ్గురూ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. పూజ అనే అమ్మాయి వారి జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికరంగా మలుపులు తిరుగుతుంది. పూజ ఎవరిని ఇష్టపడుతుంది? చివరకు ఎవరికి సొంతమవుతుంది? అన్నది సినిమాకి ప్రధాన హైలైట్‌గా చూపించారు.
శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందించగా, వైజాగ్, అరకు, భువనేశ్వర్ వంటి అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించారు. ఎడిటర్‌గా బుల్ రెడ్డి పనిచేశారు. ఐదు మంచి పాటలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
