Switch to English

అద్భుతం మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

Movie అద్భుతం
Star Cast తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసి
Director మల్లిక్ రామ్
Producer మందవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు
Music రాధన్
Run Time 2 hr 23 mins
Release నవంబర్ 19, 2021

జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన తేజ సజ్జ, ఆ తర్వాత ఇష్క్ సినిమాతో ప్లాప్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. లేటెస్ట్ గా అద్భుతం అనే సినిమాను చేసాడు ఈ యంగ్ హీరో. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయింది ఈ సినిమా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా?

కథ:

తన జీవితంలో జరుగుతున్న పరిణామాలకు డిప్రెస్ అయిన సూర్య (తేజ సజ్జ) ఆత్మహత్య చేసుకుందామని ఒక ఎత్తైన బిల్డింగ్ నుండి దూకడానికి ప్రిపేర్ అయిపోతాడు. చనిపోయే ముందు తనది ఆత్మహత్యే అని తెలియడానికి తన ఫోన్ కు తనే “నా చావుకి ఎవరూ బాధ్యలు కారు” అని మెసేజ్ సెండ్ చేసుకుంటాడు. తీరా చూస్తే అదే నెంబర్ తో ఉన్న వెన్నెల (శివాని) కు ఆ మెసేజ్ వెళ్తుంది. ఆ చర్యతో ఇద్దరూ షాక్ అవుతారు.

తర్వాత ఇద్దరూ కూడా ఫోన్ లోనే ఫ్రెండ్స్ అవుతారు. అయితే కొంత కాలానికి కలుసుకుందామని డిసైడ్ అయ్యాక తాము వేరే టైమ్ లైన్స్ లో జీవిస్తున్నారని తెలుసుకుంటారు.

అసలు ఇది ఎలా సాధ్యం? వేరే వేరే కాలాల్లో జీవిస్తోన్న వ్యక్తులు కలవగలరా? తర్వాత జరిగే పరిణామాలు ఏంటి?

పెర్ఫార్మన్స్:

తేజ సజ్జ చిన్నప్పటి నుండి సినిమాలు చేస్తూ పెరగడం వలనో ఏమో కానీ చాలా కాన్ఫిడెంట్ గా ప్రతీ సినిమాలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా పక్కింటి కుర్రాడి తరహా పాత్రను, భిన్నమైన ఎమోషన్స్ ఉన్నా కూడా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చూడటానికి రెగ్యులర్ గ్లామరస్ హీరోయిన్స్ లా ఉండదు శివాని కానీ ఆమె పెర్ఫార్మన్స్ సెన్సిబుల్ గా ఉంది. అయితే వీరిద్దరి పాత్రల మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ చేయలేకపోయారు. తులసి, కమెడియన్ సత్య తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:

రధన్ సంగీతం పర్వాలేదు అయితే ఇంకా బాగుండచ్చు అన్న ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. విద్యాసాగర్ చింత అందించిన సినిమాటోగ్రఫీ ఓకే. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ డీసెంట్ గానే ఉంది. నిర్మాణ విలువలు బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే బాగానే ఉన్నాయి.

మల్లిక్ రామ్ ఎంచుకున్న కథను ఎఫెక్టివ్ వే లో చెప్పడానికి చాలా డెప్త్ ఉంది. అయితే తన నరేషన్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. స్క్రీన్ ప్లే మీద దర్శకుడు మరింత కసరత్తు చేసి ఉంటే కచ్చితంగా టైటిల్ కు తగ్గట్లుగా ఉండేది సినిమా.

పాజిటివ్ పాయింట్స్:

  • పెర్ఫార్మన్స్ లు
  • బేసిక్ స్టోరీ లైన్

నెగటివ్ పాయింట్స్:

  • అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే
  • ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం
  • సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్.

విశ్లేషణ:

కాన్సెప్ట్ పరంగా బాగున్నా కానీ నరేషన్ విషయంలో అద్భుతం నెమ్మదిస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ లవ్ డ్రామాలో స్క్రీన్ ప్లే అతిపెద్ద మైనస్ గా నిలుస్తుంది. అందుకే అద్భుతం చాలా సాధారణంగా మారింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈమె అందాలకు హద్దు అదుపు అనేది లేకుండా పోయింది బాబోయ్‌

శ్రియ శరన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అయింది. అయినా కూడా ఈమె అందం విషయం లో ఏ...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో...

‘హరిహర వీర మల్లు’ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిరస్మరణీయమైన మరియు...

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...

పిక్ టాక్: ఎత్నిక్ వేర్ లో గ్లామర్ ఒలకబోస్తోన్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతని కట్టిపడేస్తూ ఉంటుంది. కెరీర్ లో పదిహేనేళ్ళు పైగా పూర్తి చేసుకున్నా కానీ ఇంకా అవకాశాలకు కొదవ లేదు తమన్నాకు. రీసెంట్ గా...

‘లెహరాయి’ నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,...

పుత్రిక దినోత్సవం సందర్భంగా సితారకు మహేష్ ప్రత్యేక శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన పిల్లలంటే ప్రాణం. సినిమాలకంటే కూడా కుటుంబానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ప్రతీ ఏడాది కనీసం 3,4 విదేశీ పర్యటనలు కుటుంబంతో వెళ్లడం మహేష్ అలవాటుగా...