తెలుగు ప్రజలపై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమెపై తెలుగు ప్రజానీకం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత రచ్చ జరుగుతుంటే ఆమె వివరణ ఇచ్చింది. కానీ అది కూడా తెలుగు వారికి కోపం తెప్పించేలాగానే ఉంది. తమిళనాడులో జరిగిన బ్రాహ్మణ సంఘాల మీటింగ్ లో బీజేపీ మహిళా నేత, నటి కస్తూరి మాట్లాడారు. ఆమె స్పీచ్ లో తెలుగు వారి గురించి మాట్లాడుతూ నోరు జారారు. 300 ఏళ్ల క్రితం రాజుల అంతఃపురంలో మహిళలకు సేవలు చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లు అని.. వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ చెప్తుంటే.. ఎప్పుడో వచ్చిన బ్రాహ్మణులు మాత్రం తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అంటూ దుమారం రేపే కామెంట్లు చేశారు.
ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ నడిచింది. తెలుగు వారంతా ఆమెను క్షమాపణలు చెప్పాలంటూ సీరియస్ అయ్యారు. దాంతో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. నేను తెలుగు వారిని కించ పరచలేదు. కావాలనే నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. నా మీద తెలుగు ప్రజలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. దాన్ని దూరం చేయడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ నటి కస్తూరి చెప్పుకొచ్చారు. అయితే ఆమె వివరణ కూడా తెలుగు వారికి ఆగ్రహం తెప్పించేలాగానే ఉంది.
ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్టే వివరణ ఇవ్వడంతో మరింత రచ్చ జరుగుతోంది. కస్తూరి క్షమాపణ చెప్పకుండా తాను కరెక్టే మాట్లాడినట్టు వివరణ ఇచ్చుకోవడం ఏంటని మండిపడుతున్నారు తెలుగు ప్రజలు.