నటి కస్తూరి ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుందని తెలుస్తోంది. ఆమె తెలుగు వారిపై చేసిన కామెంట్లు గాలి వానలా మారి ఇప్పుడు సునామీని తలపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దాంతో ఆమెపై పలు కేసులు కూడా నమోదవుతున్నాయి. తమిళనాడులోని చెన్నై, మధురై లాంటి ప్రాంతాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆమె ఇంటికి అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఆమె ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు లీగల్ గా ప్రయత్నాలు చేస్తోందంట. లాయర్లతో చర్చిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆమె ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పింది. తాను తెలుగు వారిని అవమానించలేదని.. డీఎంకే పార్టీ నేతలు అలా తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారంటూ చెప్పింది.
మూడు వందల ఏండ్ల క్రితం రాజుల అంతఃపురంలోని మహిళలకు సేవలు చేసేందుకు వచ్చిన వారే తెలుగు వాళ్లు అంటూ ఆమె చేసిన కామెంట్లు ఆమెను చిక్కుల్లో పడేశాయి.