నిన్న రాత్రి ఓ రిసార్ట్ లో జరిగిన గాయని మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో.. కొంతమంది గంజాయి వినియోగం జరిగిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో గుప్పుమంటోంది.. ఇదే పార్టీ కి మంగ్లీ ఆహ్వానం మేరకు హాజరైన యువ నటి దివి పై కూడా కొన్ని మీడియా లలో తన ఫోటో పెట్టీ ఏవేవో కథనాలు రాస్తున్నారని.. దివి ఆవేదన వ్యక్తం చేసింది..
“మీరైనా ఎవ్వరైనా బర్త్డే పార్టీ కి పిలిస్తే వెళతాము కదా.. అక్కడ ఎవరో ఏదో చేస్తే.. అది మనకు ఎలా తెలుస్తుంది.. దానిలో మనల్ని బాధ్యులు గా ఎలా అనుకుంటారని”, దివి ఈరోజు మీడియా కు ఓ ఆడియో నోట్ రిలీజ్ చేసింది.. పార్టీ కి హాజరయినంత మాత్రానా.. అక్కడ జరిగిన దానిలో.. తన పేరు లాగవద్దని మీడియాకు విన్నవించుకుంది.. ఒకింత ఆవేదనతో ఆడియో నోట్ రిలీజ్ చేసింది.. మీడియా వారు సంయమనంతో వ్యవహరించాలని, నటీ నటుల కెరీర్ ను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది..
