Anshu: ఇటివల ‘మజాకా’ సినిమా ఈవెంట్లో దర్శకుడు నక్కిన త్రినాధరావు నటి అన్షుపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అన్షు బాడీ షేమింగ్ పై చేసిన కామెంట్స్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడీ సంఘటనపై నటి అన్షు ఓ వీడియోలో స్పందించారు.
‘మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధరావు నాపై చేసిన కామెంట్స్ విషయం చర్చకు దారి తీశాయని విన్నాను. త్రినాధరావు ఎలాంటివారో చెప్పేందుకే వీడియో ద్వారా వస్తున్నాను. నన్ను త్రినాధరావు తన కుటుంబసభ్యురాలిలా చూసుకున్నారు. నేను తెలుగు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి త్రినాధరావుగారిని మించిన దర్శకుడు ఉండకపోవచ్చ’ని అన్నారు.
సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా నటించిన సినిమా ‘మజాకా’. సినిమాలో అన్షు నటించారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా. 2003లో నాగార్జున మన్మధుడు సినిమాతో తెరంగేట్రం చేసిన అన్షు కొన్ని సినిమాల అనంతరం వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు.