అనన్య (30 వెడ్స్ 21 ఫేమ్) ఈ పేరు తెలియని సోషల్ మీడియా యూజర్లు ఉండరేమో. ముఖ్యంగా యూట్యూబ్ లో ఆమె ఓ సెన్సేషన్. యూత్ కు క్రష్. అలాంటి అనన్య అచ్చ తెలుగు అమ్మాయి.
మొదట్లో యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ లలో మెయిన్ లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగిపోయింది.
ఇక సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఫొటోలతో విందు చేస్తోంది. సినిమాల్లో కూడా చిన్నా, చితక పాత్రలతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆమె ఐటీ యూత్ కు క్రష్ గా మారిపోయింది. ఐటీ వారికి కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా ట్రెండ్ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆమె నటించిన వెబ్ సిరీస్ అర్థమయిందా అరుణ్ కుమార్. ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో తీశారు. దాంతో ఆ సిరీస్ కు ఐటీ ఉద్యోగులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఇందులో అనన్య పాత్రకు అంతా ఫిదా అవుతున్నారు. దాంతో ఆటోమేటిక్ గా ఐటీ కుర్రాళ్లకు ఆమె క్రష్ గా మారిపోయింది. ఈ సిరీస్ ఓటీటీలో బాగా వ్యూస్ తెచ్చుకుంటోంది. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతున్నారు.
యూట్యూబ్ లో 30 వెడ్స్ 21 సిరీస్ తో అప్పట్లోనే సెన్సేషన్ అయిపోయింది ఈ అమ్మడు.
ఆ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో సినిమాల్లో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఈమె చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసింది. వరంగల్ కు చెందిన ఈ అమ్మడు.. లాలీపాప్ సాంగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తన ఇన్ స్టా గ్రాం లో గ్లామర్ ఫోటోలు పెడుతూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది ఈ భామ..