Rajinikanth: తమిళ అగ్ర హీరో రజినీకాంత్ పై నటుడు విఘ్నేశ్ చూపిన అభిమానం అతడిని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే..
నటుడు విఘ్నేశ్ కాంత్ ఇటివల రజినీకాంత్ పై అభిమానంతో తమిళ దర్శకులు, నటులతో ఓ లైవ్ పోడ్ క్యాస్ట్ నిర్వహించారు. అయితే.. ఈ పోడ్ క్యాస్ట్ ఏకంగా 50గంటలపాటు నిర్వహించి రజినీకాంత్ కు సంబంధించిన సినిమాలు, రికార్డుల విశేషాలను పంచుకున్నారు. సెప్టెంబర్ 6న ప్రారంభమైన కార్యక్రమం నిర్విరామంగా సెప్టెంబర్ 8వతేదీ సాయంత్రం 8గంటల వరకూ (50గంటలు) జరిగింది.
ఇది లాంగ్ లైవ్ పోడ్ క్యాస్ట్ గా గుర్తింపు పొందడంతో విఘ్నేశ్ ను గిన్నీస్ రికార్డు వరించింది. ఓ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు శశికుమార్ విఘ్నేశ్ కు గిన్నీస్ రికార్డు సర్టిఫికెట్ అందించారు. దీనిపై రజినీకాంత్.. ‘విఘ్నేశ్.. నిన్నెలా అభినందించాలో.. నీకేమివ్వాలో అర్ధం కావట్లేదు. 50గంటల ఇంటర్వ్యూ అంటే చిన్న విషయం కాదు. మీ అభిమానానికి ధన్యుడ్ని. నువ్వెప్పటికీ నా గుండెల్లో ఉంటావు. లవ్యూ..’ అని వాయిస్ మెసేజ్ చేశారు.