Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,455FansLike
57,764FollowersFollow

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు ఎటు టర్న్ తీసుకుంటాయో.. సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుందో అంతా టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో తమిళ నటుడు శ్యామ్ చేసిన కామెంట్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధిస్తారని తనకు ముందే తెలుసని కూడా ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘విజయ్ విజయాన్ని నేను రెండేళ్ల క్రితమే ఊహించా. విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉందని నా నమ్మకం. ఆయన విజయాన్ని నేను 2024లోనే ఊహించాను. ఓరోజు ఆయనకు ఫోన్ చేసి ‘అన్నా.. ప్రజా తీర్పులో మీరు విజయం సాధించినట్టు.. మీరు తమిళనాడు ముఖ్యమంత్రి అయినట్టు,  ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు నాకు కల వచ్చిందని చెప్పాను. ఇదే విషయాన్ని మే 3న కూడా మెసేజ్ చేస్తూ.. మీపై నా కల నిజం కాబోతోందని చెప్పా. ఇవన్నీ రాత్రికి రాత్రే వచ్చిన కలలు కావు. తమిళనాడు రాజకీయ సింహాసనంపై కూర్చుంటారని నాకు తెలుస్తోంది’.

ఆయన తప్పితే అంతటి కెరీర్ ను వదులుకుని ఎవరూ రాజకీయాల్లోకి రారు. ఆయన ఎంతో నిబద్ధత గల వ్యక్తి. నిజాయతీకి మారు పేరు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి అభిమానులేనని ఎప్పుడూ అంటారు. వారు చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వడానికే ఏదైనా చేయాలనుకుంటున్నానని ఎన్నోసార్లు అన్నారు. అటువంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుంద’ని శ్యామ్ అన్నారు. తెలుగులో శ్యామ్ కిక్ తో పరిచయమయ్యారు. రేసుగుర్రం సినిమాలో కూడా కీలకపాత్రలో నటించి మెప్పించారు.

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

Daily Horoscope: మేష రాశివారికి ఉద్యోగంలో శుభవార్తలు.. కుంభ రాశివారికి ధనలాభ సూచనలు

మే 9 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం, ఉద్యోగం,...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

Daily Horoscope: మేష రాశివారికి ఆర్థిక లాభం.. కుంభ రాశివారికి కొత్త అవకాశాలు

మే 12 , 2026 మంగళవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగం,...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్ వైరల్

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో...