Srikanth: సీనియర్ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహకు విడాకులు ఇవ్వనున్నారన్న వార్త కొద్ది రోజుల క్రితం హల్చల్ చేసింది. మనస్పర్ధల కారణంగా ఇన్నాళ్ళ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారన్న విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడే ఈ విషయంపై శ్రీకాంత్ నోరు విప్పారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. అయినప్పటికీ ఈ విషయంపై చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన మరోసారి దీనిపై మాట్లాడారు. రూమర్లకు భయపడి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నామని వాపోయారు.
కొంతమంది సోషల్ మీడియాను చాలా దుర్వినియోగం చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చే థంబ్ నెయిల్స్ చూస్తుంటే చిరాకేస్తోంది. ఇలాంటి వార్తలు విన్నప్పుడు కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడతారు. ఇవి రాసే వారి మీద కేసులు పెట్టినా వృధానే. మార్పు వాళ్లలోనే రావాలి. కొంతకాలం కిందట నేను చనిపోయానని రాశారు. ఆ తర్వాత నేను, ఊహ విడాకులు తీసుకుంటున్నామన్న విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఊహకు బయటికి రావడం ఇష్టం లేకపోయినా.. ఇలాంటి వార్తలకు భయపడి నాతో తీసుకురావలసి వస్తోంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇలాంటి వదంతులు శ్రీకాంత్-ఊహ విషయంతోనే ఆగిపోలేదు. ఇటీవల మెగా డాటర్ నిహారిక కొణిదెల, తన భర్త చైతన్యతో విడిపోతున్నట్టు న్యూస్ వైరల్ అయింది. అయితే అటు నిహారిక గాని ఇటు చైతన్య గాని ఈ విషయంపై స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందారన్న వార్త విపరీతంగా వైరల్ అయింది. స్వయంగా ఆయనే తాను బతికే ఉన్నట్టు చెప్పుకోవాల్సి వచ్చింది.
676325 837011Id should verify with you here. Which isnt one thing I often do! I get pleasure from reading a put up that will make individuals think. Furthermore, thanks for allowing me to comment! 15940