ఆలయాల్లో ప్రసాదంతో పాటు చెట్లను కూడా భక్తులకు ఇవ్వాలన్న సీనియర్ నటుడు షియాజీ షిండే ఆలోచనను స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు చెట్లను పంచే విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి తోడైతే భావితరాలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ నటుడు షిండే ఆలోచనను అభినందిస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు షియాజి షిండే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే ముంబైలోని మూడు ప్రధాన ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతో పాటు చెట్లను పంచుతున్నట్లు షిండే తెలిపారు. చెట్లను ఇవ్వడం వల్ల వాటిని కాపాడటం దైవ కార్యంగా భక్తులు భావిస్తారని, ఫలితంగా పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెట్ల సంరక్షణ పై ఆయన రాసుకున్న కవితను పవన్ కళ్యాణ్ కు చదివి వినిపించారు.
Thanks very ineresting blog!