Switch to English

మోహన్‌బాబు రౌడీయిజం: కొట్టారట, తిట్టారట.. నిజమేనా.?

సీనియర్ నటుడు బెనర్జీ అబద్ధం చెప్పే అవకాశం వుంటుందా.? యువ హీరో తనీష్ కూడా అబద్ధం చెప్పాడనే అనుకోవాలా.? మరి, నటుడు ప్రభాకర్ చెప్పినదాన్నీ అబద్ధమనే అనగలమా.? అసలు మోహన్ బాబు రౌడీయిజం చేశారా.? లేదా.? ‘మా’ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జరిగిన రౌడీయిజం గురించి సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోందిప్పుడు.

బెనర్జీని మోహన్ బాబు కొట్టారట.. తనీష్ కూడా తన్నులు తిన్నాడట.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మోహన్ బాబు తనను దారుణంగా బూతులు తిట్టారనీ, కొట్టడానికి కూడా వచ్చారనీ బెనర్జీ వాపోయారు. కంటతడిపెట్టారు.. కన్నీరు మున్నీరుగా విలపించారు.. బోరున ఏడ్చినంత పని చేశారు. తనీష్ కూడా ఇదే పరిస్థితి తనకూ ఎదురయ్యిందన్నాడు.

సాధారణ ఎన్నికల్లో ఇలాంటివి చూస్తుంటాం. స్థానిక ఎన్నికల సమయంలో వ్యవహారం హత్యలదాకా వెళుతుంది. అక్కడంటే, దోచుకోవడానికి ప్రజల సొమ్ము.. అదే ప్రభుత్వ ఖజానా వుంటుంది. ‘మా’ ఎన్నికల్లో దోచుకోవడానికి ఏముంటుంది.? ఎందుకు ఎవరైనా రౌడీయిజం చేస్తారు.?

అనసూయ గెలవకపోయినా గెలిచిందనే ప్రకటన ఎందుకు వచ్చిందో.. మేం, ఖచ్చితంగా గెలుస్తున్నామని మంచు విష్ణు మొదటి నుంచీ ‘అతి ’ ధీమా ఎందుకు ప్రదర్శించారో.. ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలేమీ కావు. మొదటి రోజు కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పత్రాలు ఎందుకు బయటకు వెళ్ళాయన్నది మరో ప్రశ్న.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియా ముందుకొచ్చారు. మోహన్ బాబు, నరేష్ కలిసి నడుపుతోన్న ‘మా’లో తాము ఇమడలేమని చెప్పారు. తమ పదవులకు రాజీనామా చేస్తూ, ‘మా’ సభ్యులుగా మాత్రమే కొనసాగుతామని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్, ఉత్తేజ్ తదితరులు చెప్పుకొచ్చారు.

‘మా’ హిస్టరీలోనే ఇదొక కొత్త వింత వ్యవహారం. వీళ్ళంతా రాజీనామా చేసినా, వారి స్థానంలో ఇతరుల్ని నామినేట్ చేసే అవకాశం ‘మా’ అధ్యక్షుడికి వుందట. ‘మేం ప్రశ్నిస్తాం.. అది మీరు తట్టుకోలేరు. అందుకే, గొడవలు జరగకుండా.. ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు అద్భుతంగా పనులు చేయండి, వాటికి మేం అడ్డు పడం.. పదవుల్లో వుండగా ప్రశ్నించడం కష్టం గనుక, 11 మందిగా ప్రశ్నించడం కంటే, వందల మంది సభ్యుల తరఫున ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాం..’ అని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులూ ముక్త కంఠంతో నినదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

ఔనా! నిజమా.? ఆంధ్రప్రదేశ్‌లో నిధుల కొరత లేదా.?

అప్పు చేస్తే తప్ప పూటగడవని దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది కళ్ళ ముందు కనిపిస్తోన్న వాస్తవం. ప్రతి నెలా కొత్త అప్పు చేయాల్సిందే.. నెలవారీ అప్పులే కాదు,...

మహేష్ థియేటర్ లో కోటి వసూలు చేసిన లవ్ స్టోరీ

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలి వీకెండ్ అద్భుతమైన రెస్పాన్స్ కనబరిచిన ఈ చిత్రం...

టీడీపీ, వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామా కాదు కదా.?

తెలుగు నేలపై గతంలో ఎన్నడూ లేని విధంగా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం సరికొత్త పుంతలు తొక్కుతోంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయ నాయకులు, పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీకి...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

గన్ తో మంచు మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చి…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు ఫ్యామిలీ హల్చల్ బాగానే చేసింది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా పోటీ చేసిన నేపథ్యంలో మంచు ఫ్యామిలీ, ప్రత్యర్థులకు బాగానే కౌంటర్ ఇచ్చారు. ఫైనల్...