పుష్ప-2 మీద అంచనాలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో ఎప్పుడెప్పుడు మూవీ విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వరుసగా ఈవెంట్లు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ సీన్లే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొదటి పార్టులో యాక్షన్ సీన్లే బాగా క్రేజ్ తెచ్చాయి. అందుకే ఈ పార్టులో కూడా యాక్షన్ సీన్లకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
పుష్పరాజ్ మేనరిజంలో యాక్షన్ సీన్లు చేస్తాడని.. అవి ఊహించడానికి కూడా అందని విధంగా ఉంటాయని సమాచారం. ఇప్పటి వరకు చూడని విధంగా యాక్షన్ సీన్లు ఉంటాయంటున్నారు. సుకుమార్ సినిమాలో యాక్షన్ సీన్లు ఎంత రసవత్తరంగా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. అందుకే పుష్ప-2లో కూడా వీటినే హైలెట్ చేస్తున్నారు. పైగా ఇందులో జాతర సీన్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. అందులో బన్నీ ఆడవేశంలో చేసే ఫైట్స్ నెవ్వర్ బిఫోర్ అన్నట్టే ఉంటాయని ఇప్పటికే హింట్స్ ఇస్తున్నారు. దాంతో బన్నీ అభిమానులు ఈ సీన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇందులో యాక్షన్ సీన్లలో బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికే స్టేజిల మీద దేవి శ్రీ ప్రసాద్, ఇతర టెక్నీషియన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి సినిమాను ఈ యాక్షన్ సీన్లు ఏ లెవల్ కు తీసుకెళ్తాయో చూడాలి.