స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ సమేతంగా అందరూ ఒకే చోట ఉంటున్నారు. సోనూసూద్ భార్య సోనాలి, తన మేనల్లుడుతో కలిసి నాగ్ పూర్ కు వెళ్లారు.
అక్కడ సోనాలితో పాటు ఆమె మేనల్లుడు, మరో మహిళ కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ అలెర్ట్ అయి పెను ప్రమాదం నుంచి బయటపడేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సోనాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే ఆమె మేనల్లుడికి, మరో మహిళకు కూడా చిన్న గాయాలు అయినట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం సోనూసూద్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై సోనూసూద్ టీమ్ స్పందించింది. సోనాలి హెల్త్ అప్ డేట్ ఇచ్చింది. సోనాలికి యాక్సిడెంట్ అయిన వెంటనే నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారని.. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్టు తెలిపింది.
ఇక ఘటన గురించి తెలిసిన వెంటనే సోనూసూద్ నాగ్ పూర్ బయలు దేరినట్టు సమాచారం. సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన ఫతే సినిమాతో పలకరించారు.