జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుర్తింపునిచ్చింది.
ఇదే బహుశా ఏబీఎన్ ఆర్కే జీర్ణించుకోలేకపోతున్నట్లుంది.! జనసేన పార్టీకి గుర్తింపు వచ్చాక, జనసేన పార్టీకి ఎన్నికల సింబల్‌గా గ్లాస్ గుర్తు ఫిక్స్ అయ్యాక.. ‘విలీన విషాన్ని’ ఆర్కే, జనసేన మీద ఎందుకు చిమ్ముతున్నట్లు.?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో, మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ, చిరంజీవి కలిసి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు చిరంజీవి ఢిల్లీకి వెళ్ళారు.. ఆ సంబరాల్లో ప్రధానితో చిరంజీవి కలిశారు. ఇదీ జరిగిన విషయం.
ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచీ, చిరంజీవి మీద కడుపు నిండా విషాన్ని నింపుకున్న ఏబీఎన్ ఆర్కే, తాజాగా ప్రధాని మోడీని చిరంజీవి కలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. చిరంజీవి పేరుని ప్రస్తావిస్తూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. అంటూ ఓ ఫేక్ వార్తని వండి వడ్డించేస్తున్నారు ఏబీఎన్ ఆర్కే. ఈ మేరకు ఓ డిస్కషన్ కూడా తన మీడియా ఛానల్ ద్వారా షురూ చేశారు.
దేనికోసం ఇదంతా.? పదేళ్ళు జనసేన పార్టీ జనంలో వుండి, మార్పు కోసం కొట్లాడింది, బీజేపీలో విలీనం అయ్యేందుకా.? విలీనం కోసమే అయితే, అసలంటూ పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు కదా.! 2014 ఎన్నికల సమయంలోనే, బీజేపీ నుంచి పోటీ చేసి, పవన్ కళ్యాణ్ చట్ట సభలకు వెళ్ళి, కేంద్ర మంత్రి అయివుండేవారు. కానీ, పవన్ కళ్యాణ్ అలా చేయలేదు.
జనసేన పార్టీ ఈ పదేళ్ళలో పడ్డ స్ట్రగుల్ అంతా ఇంతా కాదు.! ఇది ఆర్కేకీ తెలియని విషయమేమీ కాదు. తెలిసీ, విషం చిమ్ముతున్నాడంటే ఏంటి అర్థం.? బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. అని ప్రస్తావిస్తున్న ఏబీఎన్ ఆర్కే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చంద్రబాబు.. అని రాసే సాహసం చేయగలడా.?
అన్నట్టు, ఇటీవల టీడీపీ నేత ఒకరు కోటి రూపాయలు ఖర్చు చేసి సాక్షి దినపత్రిలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో కూడిన ప్రకటన ఒకటి పబ్లిష్ చేయించిన సంగతి తెలిసిందే. దాంతో, టీడీపీపైనా ఆర్కే పగబట్టినట్లుంది. తనకు దక్కాల్సిన కోటి, సాక్షికి వెళ్ళడమేంటి.? అని ఆర్కే లోలోపల కుతకుతలాడిపోతున్నాడా.? అందుకేనా లోకేష్ – పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయంగా చిచ్చు పెట్టి, టీడీపీ – జనసేన పొత్తుని చెడగొట్టాలనుకుంటున్నది.? చేసిన పాపమంతా ఏబీఎన్ ఆర్కే చేసేసి, దాన్ని బీజేపీ మీద నెట్టేసి.. మూడు పార్టీల మధ్యా చిచ్చు పెట్టాలని ఆర్కే ఎందుకు అనుకుంటున్నాడు.?
ఒక్కటి మాత్రం నిజం.. ఆర్కే తెలంగాణ పైత్యమంతా, ఏపీ రాజకీయాలపై చూపిస్తున్నట్లే కనిపిస్తోంది.! చంద్రబాబు వీలైనంత వరకు ఏబీఎన్ ఆర్కేని దూరం పెట్టకపోతే కూటమి మధ్య ఆర్కే, ‘పచ్చ మీడియా’ ముసుగులో కుంపటి రాజేయడం ఖాయం.!