ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు బాట పట్టింది. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అంతకుముందు సెంచరీ చేసిన వెంటనే SRH అభిమానులకు అభిషేక్ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు.
సెంచరీ కొట్టిన తర్వాత జేబులోంచి ” THIS ONE IS FOR ORANGE ARMY” అని రాసిన పేపర్ ను అభిమానులకు చూపించి సంబరాలు చేసుకున్నాడు. ఈ సీజన్ లో అభిషేక్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసే సమయంలోను ఫీల్డింగ్ లో తడబడ్డాడు. SRH బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ లో SRH కొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ చేజ్ చేసిన రెండో టీం ఇదే. చేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అభిషేక్ శర్మ దే. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈరోజు SRH చేసిన 247 పరుగులు మూడో అత్యధిక స్కోర్. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక భాగస్వామ్యం (171) నెలకొల్పింది SRH ఓపెనర్లే.