ఎన్నో సినిమాలకు కథు అందించి.. స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించిన అబ్బూరి రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడనే విషయం తెల్సిందే. సాదారణంగా రచయితలకు ఎక్కువగా గుర్తింపు ఉండదు. టాలీవుడ్లో అతి కొద్ది మంది రచయితలకు మాత్రమే గుర్తింపు ఉంది. అందులో అబ్బూరి రవి ఒకరు. ఆయన రచయితగా వ్యవహరించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రచయితగా ఫేమస్ అయిన అబ్బూరి రవి మాతృ మూర్తి లలిత నిన్న సాయంత్రం గుండెపోటుతో మరణించారు.
73 ఏళ్ల లలిత గారికి నలుగురు కుమారులు. అందులో చిన్నవాడు అబ్బూరి రవి. వీరి సొంత ప్రాంతం ఏపీలోని భీమవరం అయినా కూడా కొడుకులు హైదరాబాద్ లో సెటిల్ అవ్వడంతో లలిత కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. లలిత గారి అంత్యక్రియలు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో నిర్వహించడం జరిగింది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను సందర్శించేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు.
సెలబ్రెటీలు ఎవరు రాకుండానే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్య క్రియలు నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మద్య ఆమె అంత్య క్రియలను పూర్తి చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అబ్బూరి రవికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా నివాళ్లు అర్పించారు.
396432 233034Dead written articles , appreciate it for entropy. 553396
733245 559086Some genuinely marvellous function on behalf with the owner of this internet website, utterly outstanding content material. 447937