నార్నే నితిన్, నయన్ సారికలు జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి లు నిర్మించిన చిత్రం ‘ఆయ్’. అంజి కే మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేశారు. సినిమాకి సూపర్ హిట్ టాక్ దక్కింది. భారీ పోటీ మధ్య విడుదల అయిన ‘ఆయ్’ సినిమా భారీ వసూళ్లు దక్కించుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ పలు విశేషాలను తెలియజేశారు..
కూకట్‌పల్లి విశ్వనాథ్‌లో సినిమా రిలీజ్ తర్వాత ఆడియెన్స్‌తో కలిసి చూస్తున్నప్పుడు నా ఎదురు సీట్‌లో ఉన్న వ్యక్తి నవ్వలేక లేచి నిలుచున్నాడు. నేను కథ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో దాన్ని స్క్రీన్ పై చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్టాఫ్ చివరి అర్థగంట థియేటర్స్‌లో ఒకటే నవ్వులు.
సాధారణంగా మనం సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు మలయాళం వాళ్లు చాలా నేచురల్‌గా చేస్తారని అంటుంటాం. అలాంటి సినిమా మనం ఎందుకు చేయకూడదనుకున్నాను. సినిమా పక్కా ఎంటర్‌టైనర్. కథ కన్నా ఎంటర్‌టైన్మెంట్, గుడ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆయ్ సినిమా ఆఫ్టర్ కరోనా మూవీ, తప్పకుండా చూడండని చెప్పాను.
ఆయ్ సినిమా వంటి ఎంటర్‌టైనర్‌ను చేసినప్పుడు మామూలుగా యూత్‌కు కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా గట్టిగా కొట్టాలంటే ఇంకేదో ఉండాలండి అని నేను డైరెక్టర్ గారికి చెప్పాను. దాంతో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ నుంచి ఆ సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చుకున్నారు.
ఆయ్ సినిమా షోస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మేం కూడా పెంచుతున్నాం. నా లైఫ్‌లో గ్రేట్ రిలేషన్స్ ఉన్నాయంటే ఫ్రెండ్ షిప్. నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే నా స్నేహితులే కారణం. చిన్న సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టినప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది.
తండేల్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సీజీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అవన్నీ చూసుకుని దసరా తర్వాతే రిలీజ్ డేట్ మీద క్లారిటీ వస్తుందనుకుంటున్నాను.