బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా లో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. బాలరాజు బోడి పాత్రలో కనిపిస్తాడు చైతన్య. తన పాత్ర చిత్రంలో ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ కూడా బాలరాజు పాత్ర గురించి, నాగ చైతన్య నటన గురించి గొప్పగా చెప్పాడు.
ఇంతకీ ఈ బాలీవుడ్ చిత్రాన్ని చేయడానికి నాగ చైతన్య ఎంత పారితోషికం తీసుకున్నాడు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 5 కోట్ల రూపాయలను నాగ చైతన్య పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది.
అటు పే చెక్ పరంగా ఇటు బాలీవుడ్ లో లాంచ్ పరంగా చైతన్యకు ఇది మంచి అవకాశమని చెప్పాలి. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు.
362823 674794really good publish, i surely adore this internet site, carry on it 685904