స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ మాత్రమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులను కూడా తిరగరాసింది ఈ చిత్రం. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. రూరల్ యాక్షన్ థ్రిల్లర్ గా పుష్ప తెరకెక్కనుంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ట్రేండింగ్ బ్యూటీ రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనున్న విషయం తెల్సిందే.
ఇక మరికొద్ది రోజుల్లో షూటింగ్ కు వెళదాం అనుకుంటున్నా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఆ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఇక పుష్ప షూటింగ్ ను సెప్టెంబర్ నుండి మొదలుపెడదాం అనుకుంటున్నారు టీమ్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలకమైన పాత్రకు ఆది పినిశెట్టిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆది పినిశెట్టి సుకుమార్ లాస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రంలో చరణ్ అన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి సుకుమార్ ఆదిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
80854 764075among the very best system I know, thank you really a lot . 482757
609021 540825Black Ops Zombies […]some folks still have not played this game. It is hard to picture or believe, but yes, some men and women are missing out on all of the enjoyable.[…] 145858
230853 920085I took a break to view your write-up. I discovered it quite relaxing 228082
545437 441933Oh my goodness! a wonderful post dude. Thanks a good deal Nevertheless I will be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everyone acquiring identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 734959