Switch to English

ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ: డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

Movie ఆడవాళ్లు మీకు జోహార్లు
Star Cast శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బు, రాధిక శరత్‌కుమార్
Director కిషోర్ తిరుమల
Producer సుధాకర్ చెరుకూరి
Music దేవి శ్రీ ప్రసాద్
Run Time 2గం 21ని
Release 4 మార్చి, 2022

గత కొంత కాలంగా ప్లాపుల్లో మగ్గుతోన్న శర్వానంద్ కు హిట్ కచ్చితంగా కావాలి. సెన్సిబుల్ చిత్రాలు తీస్తాడని పేరున్న కిషోర్ తిరుమలతో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసాడు. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా?

కథ:

చిరు (శర్వానంద్)కు తన ఇంట్లోని ఆడవాళ్ళ వల్ల వరసగా సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఆద్య (రష్మిక)ను కలుస్తాడు చిరు. ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అది ప్రేమగా కూడా మారుతుంది. ఒకానొక సందర్భంలో ఆద్యకు తన ప్రేమ విషయం చెప్పేస్తాడు చిరు. కానీ ఆద్య ఒప్పుకోదు. ఎందుకంటే తన తల్లి వకుళ (ఖుష్బూ)కు పురుష ఆధిక్య పెళ్లి మీద మంచి ఒపీనియన్ ఉండదు.

ఈ నేపథ్యంలో చిరు ఏం చేస్తాడు? చివరికి చిరు, ఆద్య ఒక్కటయ్యారా లేదా?

నటీనటులు:

ఎలాగైనా పెళ్లి చేసుకోవాలన్న కుతూహలం ఉండే యువకుడి పాత్రలో శర్వానంద్ మెప్పిస్తాడు. లైవ్లీ పాత్రలు ఇస్తే శర్వానంద్ ఎంత చక్కగా నటిస్తాడో మరో సారి చూపించాడు.

రష్మిక చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్టైలింగ్ సినిమాలో అదిరిపోయింది. శర్వానంద్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. నటన పరంగా కూడా రష్మిక ఓకే.

రవి శంకర్ క్యామియో పాత్రలో ఓకే. ఇక లేడీ గ్యాంగ్ అయిన ఖుష్బూ, రాధికా, ఊర్వశి, ఝాన్సీ సినిమాలో కీలక పాత్రలు చేసారు. వారి పెర్ఫార్మన్స్ లకు వంక పెట్టడానికి లేదు. మిగతా వారంతా మాములే.

సాంకేతిక నిపుణులు:

సుజిత్ సారంగ్ సినిమా పనితనం కలర్ఫుల్ గా సాగింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉంది కానీ ఇంకా షార్ప్ గా ఉండొచ్చన్న ఫీలింగ్ కలుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం డీసెంట్ గానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. అయితే దేవి నుండి ఇంకా బెటర్ ఔట్పుట్ ఆశిస్తాం.

సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. బెస్ట్ కాస్ట్ అండ్ క్రూను సెట్ చేయడంతో పాటు ప్రతీ సీన్ గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక కిషోర్ తిరుమల రైటింగ్ పరంగా యావరేజ్ మార్కులే వేయించుకుంటాడు. దర్శకత్వం ఓకే.

పాజిటివ్ పాయింట్స్:

  • హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
  • ప్రముఖ పాత్రల పెర్ఫార్మన్స్ లు

నెగటివ్ పాయింట్స్;

  • రొటీన్ కథా, కథనాలు

చివరిగా: ఆడవాళ్లు మీకు జోహార్లు కథ పరంగా ఎగ్జైటింగ్ గా అనిపించదు. నరేషన్ పరంగానూ పెద్ద మెరుపులేం లేవు. కాకపోతే పెద్దగా బోర్ కొట్టకుండా అలా అలా సాఫీగా సాగిపోతుంది. పెద్దగా హైస్ అండ్ లోస్ లేకపోయినా నటీనటులు పెర్ఫార్మన్స్ లకు ఒకసారి చూడవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

బ్రహ్మాస్త్ర నుండి దేవ దేవ…

రణ్బీర్‌ కపూర్‌ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అమితాబచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన కుంకుమల పాట సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే....

రాశి ఫలాలు: ఆదివారం 07 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధదశమి రా.7:39 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: అనూరాధ మ.1:23 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం:...

ఏపీలో టీడీపీ పరిస్థితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి వస్తుందా.?

2014 నుంచి 2018 వరకు టీడీపీ - బీజేపీ కలిసే వున్నాయ్. 2018 నుంచి కథ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించడం మొదలు పెట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది....

గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ: రామ్మోహన్ నాయుడు

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ అవుతుందనే ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయడు అన్నారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని.. మహిళల...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...