సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా కృతి శెట్టి చేస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.
సుధీర్ – మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇప్పటికే వీరిద్దరూ సమ్మోహనం, వి చిత్రాలను చేసారు. సమ్మోహనం స్టైల్ లోనే మరో ఫుల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు మోహన్ కృష్ణ.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు దర్శకుడిగా కనిపిస్తాడు.