ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను కూడా డిఫరెంట్ గా చేశారు. కానీ అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్లు ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడు అట్లీ.
మరీ ముఖ్యంగా భారీగా వీఎఫ్ ఎక్స్ ను ఇందులో వాడబోతున్నారు. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. పైగా దీన్ని సైన్స్ ఫిక్షన్ కమ్ యాక్షన్ మూవీగా తీస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డైరెక్టర్ అట్లీ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు.
అల్లు అర్జున్ తో ఆయన భేటీ కాబోతున్నారు. అల్లు అర్జున్ తో ప్రీ ప్రొడక్షన్ పనులపై చర్చించబోతున్నారు. ఎలాంటి టెక్నీషియన్లను తీసుకుంటున్నారో, ఎలాంటి విజువల్స్ ను రెడీ చేస్తున్నారో ఇందులో చర్చిస్తారు. మొన్నటి వరకు విదేశాల్లో బిజీగా గడిపారు డైరెక్టర్ అట్లీ. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు A22 x A6గా పేరు పెట్టారు. నటీనటులు, టెక్నికల్ బృందానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. బన్నీ-అట్లీ కాంబోలో వస్తున్న మొదటి మూవీ ఇదే. పైగా అట్లీ తెలుగులో చేస్తున్న మొదటి మూవీ కూడా. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.’
