Switch to English

సుకుమార్, చరణ్ కలిసి ‘పుష్ప’ వెబ్ సిరీస్

సుకుమార్ కు క్రియేటివ్ దర్శకుడన్న పేరు ఉంది. ప్రతీ సినిమాకూ చాలా సమయం తీసుకునే సుకుమార్ తన ప్రతీ స్క్రిప్ట్ కూ బోలెడంత పరిశోధన చేస్తుంటాడు. స్క్రీన్ ప్లే ను అద్భుతంగా మలచగలిగే నేర్పు ఉన్న సుకుమార్, ప్రతీ విషయంలోనూ ఒరిజినాలిటీకే ఓటు వేస్తాడు. అందుకే సుకుమార్ సినిమాలు ప్లాప్స్ అయ్యాయి కానీ బ్యాడ్ మూవీస్ మాత్రం లేవు. రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప తీయనున్న సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తైపోయాయి. ఇక షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకుంటుండగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం వల్ల బ్రేకులు పడిన విషయం తెల్సిందే.

తాజాగా సుకుమార్ గురించి ఆసక్తికర కథనమొకటి బయటపడింది. ఈ సినిమా ప్రధానంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందన్న విషయం తెల్సిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారుచేసే పనిలో భాగంగా సుకుమార్ అండ్ తన టీమ్ ఎర్ర చందనం గురించి చాలానే పరిశోధన చేసినట్లు, వారి వద్ద బోలెడంత మెటీరియల్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లోంచి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే సినిమా కోసం తీసుకున్నారని, ఇంకా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు ఎన్నో స్క్రిప్ట్ లో భాగంగా రాసుకున్నారని తెలుస్తోంది. సెన్సార్ పరిమితుల కారణంగా వాటిని తెరపై చూపించలేరు కాబట్టి సుకుమార్ ఇప్పుడు దాన్ని వెబ్ సిరీస్ గా మలచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ తో బడ్జెట్ తదితర విషయాల మీద చర్చలు సాగుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ బంధువొకరు ప్రైమ్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారని, చరణ్ మరియు ఆయన ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సుకుమార్ కథను ఇచ్చి, తన అసిస్టెంట్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సుకుమార్, చరణ్ నిర్మాణ పార్ట్నర్స్ గా కొనసాగే అవకాశాలున్నాయి. ఏదేమైనా లాక్ డౌన్ తొలగిపోతే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

ఫ్లాష్ న్యూస్: ఈ విపత్తు సమయంలో చైనా ఎంతటి నీచానికి పాల్పడినదో తెలుసా?

ప్రపంచం మొత్తం కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చైనా కూడా తమ నీచమైన బుద్దిని...

తన బిడ్డలను వేదిస్తున్నారంటూ కువైట్‌ నుండి తల్లి ఫిర్యాదు

తూర్పుగోదావరి నుండి ఉపాది కోసం కువైట్‌ వెళ్లిన ఒక మహిళ తన ఇద్దరు కూతుర్లను ఆకతాయిలు వేదిస్తున్నారు అంటూ వీడియో కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. తన కూతుర్లను చిన్న పిల్లలు చేసి...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ భారీ...