అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి సంచలన సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోందనే విషయం తెల్సిందే.
సినిమా ఎంత గొప్పగా రూపొందించినా కూడా మంచి సమయం చూసి విడుదల చేయాలి. అలా మంచి సమయంలో విడుదల చేయకుంటే కచ్చితంగా ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని ఇప్పటికే పలు సినిమాల ఫలితాల ద్వారా నిరూపితమైంది.
పుష్ప 2 విడుదల గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ లో సినిమా విడుదల ఉంటుందని అంత భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ కాకుండా వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా పుష్ప 2 వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సంక్రాంతి సినిమాలతో పోటీపడి చాలా నష్టపోవాల్సి ఉంటుందని పుష్పం మేకర్స్ ని కొందరు హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.