గోరంట్లతో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

గోరంట్ల మాధవ్ తో వైసీపీకే నష్టమా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏరికోరి పోలీస్ పదవికి రాజీనామా చేయించి మరీ జగన్ తన పార్టీలోకి తెచ్చుకున్నారు మధవ్ ను. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి పార్టీకి జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాధవ్ న్యూడ్ వీడియో దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. దాన్ని కవర్ చేయడానికి నానా పాట్లు పడ్డా.. జనాలు మాత్రం అస్సలు నమ్మలేదు కదా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. అది వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది మహిళలు వైసీపీకి ఓటేయకుండా చీవాట్లు పెట్టారు.

మహిళలు అంతగా విమర్శలు గుప్పించడం వెనక జగన్ మౌనం కూడా ఉంది. అంత పెద్ద న్యూడ్ వీడియో ఘటన జరిగిన తర్వాత.. జగన్ కిసుమంతైనా యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే.. జగన్ గౌరవం పోకుండా ఉండేది. ఇంత చేసినా ఆయన్ను సమర్థించారు జగన్. అది పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు జగన్ వద్ద ఏదో మార్కులు కొట్టేయాలని మాధవ్ చేసిన అత్యుత్సాహం మరింత డ్యామేజ్ చేసేస్తోంది. జగన్ భార్య భారతిని టీడీపీ సస్పెండ్ చేసిన చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాలని హిందూపురం నుంచి విజయవాడకు ఆగమేఘాల మీద వచ్చారు మాధవ్.

రావడమే ఆలస్యం నానా రచ్చ చేసేశారు. కిరణ్‌ మీద దాడి చేసే క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ ఆయన మీద కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారు. అంటే ఏదో చేయాలిన వస్తే ఇంకేదో జరిగిందన్నమాట. పైగా అరెస్ట్ చేశాక మాధవ్ వ్యవహరించిన తీరు మరింత విమర్శలకు దారి తీసింది. హాస్పిటల్ లో చెకప్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడటం.. ప్రెస్ మీట్ టైమ్ లో ముసుగు వేసుకోమంటే పోలీసులతో వాగ్వాదానికి దిగడం లాంటివి జరిగాయి. కోర్టు వద్ద ఆయన చూపించిన వ్యవహారి శైలి పోలీస్ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. గోరంట్ల విషయంలో ఇప్పటికే పది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

మొత్తానికి మాధవ్ తీరుతో పోలీసుల ఆగ్రహం.. ప్రజల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. అది పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తోంది. ఇంత జరిగినా సరే జగన్ మాత్రం గోరంట్ల విషయంలో మౌనంగానే ఉంటున్నారు. కనీసం ఆయన తీరును ఖండించకపోవడంతో వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. జగన్ భార్యను తిట్టాడనే కారణంతో చేబ్రోలు కిరణ్ ను టీడీపీ సస్పెండ్ చేసి కేసులు పెట్టి మరీ తమ విధానం ఏంటో నిరూపించుకుంది. కానీ మాధవ్ విషయంలో జగన్ ఇంత మౌనంగా ఉంటూ.. తమ విధానం ఇదే అన్నట్టు చూపించుకోవడం ఆయన పార్టీకే నష్టం అంటున్నారు రాజకీయ మేథావులు.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

“యుద్ధానికి సన్నద్ధం… హార్ముజ్‌లో దిగ్బంధం” : Donald Trump తాజా హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump తాజాగా యుద్ధ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇరాన్‌తో జరిగిన...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

“‘అమరావతిని అజరామరం చేశారు’ : నారా లోకేష్”

ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravatiకు చట్టబద్ధ గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక బిల్లుపై సంతకం చేసిన Droupadi Murmuకు మంత్రి Nara Lokeshతో పాటు ఎన్డీఏ ఎంపీలు...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...