Viral News: 10ఏళ్లు నిండని బాలుడు.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్న వయసు.. తల్లిదండ్రుల తీర్చే అచ్చటా ముచ్చటలో ముద్దుగా పెరగాల్సిన రేపటి పౌరుడు ఆకస్మికంగా తనువు చాలించాడు. అదీ జీవితం అంటే ఏంటో తెలీని వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. విషాదం కలిగించే సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగుడెంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు 9ఏళ్ల హర్షవర్ధన్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. ఇన్నాళ్లూ బాగానే ఆడుకుని సంతోషంగా ఉన్నాడు. తండ్రి కాంతారావు కుమారుడికి హెయిర్ కటింగ్ చేయించాడు. తండ్రి తనకు ఇష్టంలేని హెయిర్ కటింగ్ చేయించారని మనస్తాపానికి గురయ్యాడు.
విషయం తీవ్రత తెలుసుకునేలోపే హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తీసకెళ్లినా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో కాంతారావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి తల్లిదండ్రుల ఆవేదన గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటూ చదువుతుండగా వేసవి సెలవులకు ఇంటివద్దకు వచ్చాడు.
తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని… pic.twitter.com/8wRkveYc1o
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2024