భారతదేశానికి, బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తారు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా చూస్తారు. ఇక 2021లో భారతదేశం మొత్తం ఎంత బంగారం కొనుగోలు చేసిందో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం భారతీయులు కేవలం 2021లోనే 611 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది మన దేశం.
ఈ నివేదికలో మధ్య తరగతి భారతీయులు బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక మొత్తం బంగారంలో 80-85 శాతం 22 క్యారెట్ల బంగారానిదే అగ్ర తాంబూలమని తేల్చి చెప్పింది. 18 క్యారెట్ల బంగారం కొనుగోలు కూడా ఊపందుకున్నట్లు వెల్లడించింది.