బింబిసారతో నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్బ్ హిట్ ను అందించాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మొదటి వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం. ఇక ఐదు రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 23 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది.
మొదటి ప్రయత్నంలోనే టైమ్ ట్రావెల్ వంటి సంక్లిష్టమైన కాన్సెప్ట్ ను చాలా సులువుగా వివరించిన వశిష్ఠను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే వశిష్ఠకు మొదటి ప్రయత్నం అంత సులువుగా దక్కలేదు. ఈ చిత్రానికి ముందు యంగ్ హీరోలైన నితిన్, రామ్, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ లను కలిసాడట వశిష్ఠ.
అయితే వారెవరూ తనతో చిత్రాలు చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నమ్మడమే కాకుండా దాదాపుగా 15 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాడు. ఈరోజు ఆ రిస్క్ ఫలితాలను అందించింది.