Switch to English

స్పెషల్‌: దేవకన్యను దివి నుండి భువికి తీసుకు వచ్చిన జగదేకవీరుడికి 30 ఏళ్ళు

ఇండియన్‌ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్నా అద్బుతమైన క్లాసిక్‌ చిత్రాలు వంద వరకు ఉంటాయి. అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉంటాయి. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఖచ్చితంగా ఉంటుంది అనడంలో అతి శయోక్తి లేదు. సినిమాను అప్పటి వరకు ప్రేక్షకులు చూస్తున్న తీరును మార్చేసిన చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే ఈ చిత్రం చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికి ఒక అద్బుతమైన ఫాంటసీ చిత్రంగా నిలిచిపోయింది.

ఎన్టీఆర్‌ నటించిన జగదేక వీరుడి కథ లాంటి ఒక మంచి సినిమా తీయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాత అశ్వినీదత్‌ ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేయానుకున్నాడు. ఒకసారి తిరుపతిలో ఉన్న సమయంలో వైజయంతి మూవీస్‌కు చెందిన కో డైరెక్టర్‌ శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూలోకంకు వచ్చి ఉంగరం పోగొట్టుకోవడం, అది ఒక సామాన్యుడికి దొరుకుతుంది అనే లైన్‌ చెప్పాడట. ఆ లైన్‌ రాఘవేంద్ర రావుకు చెప్పడంతో వెంటనే కథ తయారి మొదలు పెట్టారు.

ఈ కథను జంధ్యాల, యండమూరి వీరేంధ్రనాధ్‌, సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్‌, క్రేజీ మోహన్‌ వంటి మహామహులు కలిసి కూర్చుని రెడీ చేశారు. ఇంతటి మహానుభావులు కలిసి కూర్చున్న తర్వాత కథ అద్బుతంగా కాకుండా మరెలా ఉంటుంది. రాఘవేంద్ర రావుకు ఈ గొప్ప రచయితల టీం అద్బుతమైన కథను అందించారు. భారీ బడ్జెట్‌ అవుతుందని ముందే ఊహించారు. అయినా కూడా అశ్వినీదత్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని నిర్మించారు.

ఆరున్నర నుండి ఏడు కోట్లల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని మొదట అనుకున్నా అది కాస్త 8 కోట్లకు పైచిలుకు అయ్యింది. అప్పట్లో అయిదు కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటేనే చాలా గొప్ప విషయం. 8 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే అప్పుడు సినీ ప్రముఖులు పలువురు నోరు వెళ్లబెట్టారు. రెండు మూడు పెద్ద సినిమాలు తీసేయవచ్చు, అంతటి ప్రయోగం అవసరమా అంటూ పెదవి విరిచారట. ఆ విమర్శలు, కామెంట్స్‌ పట్టించుకోకుండా అనుకున్నది అనుకున్నట్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

మహామహులను ఈ చిత్రంలో చూపించాడు. ఎన్నో పద ప్రయోగాలు చేయడంతో పాటు అప్పటి వరకు ఏ సౌత్‌ సినిమాలకు కూడా ఉపయోగించని గ్రాఫిక్స్‌ టెక్నాలజీ మరియు ఇతరత్ర టెక్నికల్‌ అంశాలను వినియోగించి ఒక విజువల్‌ వండర్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంకు ఇళయరాజా అందించిన సంగీతం ఒక అద్బుతం. ఆయన ఈ సినిమాకు గాను నంది అవార్డును అందుకున్నారు. సినిమాలోని ఆ పాట ఈ పాట అని కాకుండా అన్ని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రతి పాట కూడా దేనికి అదే అన్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా అబ్బనీ తీయని దెబ్బ మెలోడీ ట్యూన్‌తో సాగే మాస్‌ సాంగ్‌గా నిలిచింది.

సరికొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసిన ఈ చిత్రం మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌డంను మరింతగా పెంచడం జరిగింది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాత శ్రీదేవిని అభిమానులు నిజంగా దేవకన్యలు ఇలాగే ఉంటారేమో అనుకున్నారు. అప్పటి నుండి కూడా శ్రీదేవికి అతిలోక సుందరి పేరు పడిపోయింది.

ఈ చిత్రంలో పిల్లలుగా నటించిన శాలిని, శామిలిలు ఆ తర్వాత కాలంలో హీరోయిన్స్‌గా కూడా నటించారు. అయితే వారు హీరోయిన్స్‌గా చేసిన సినిమాల కంటే కూడా ఈ చిత్రంతోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ చిత్రంలో ఇంద్రజ పాత్ర పోషించిన శ్రీదేవి చిరంజీవిని మానవా అంటూ పిలవడం అందరికి బాగా కనెక్ట్‌ అయ్యింది. ఈ చిత్రంలో కామెడీ సీన్స్‌ను జంద్యాల గారు అద్బుతంగా రాశారు.

సినిమాలోని ప్రతి సీన్‌ను కూడా రాఘవేంద్ర రావు తెరకెక్కించిన తీరు అమోఘం. ఈ చిత్రానికి గాను ఆయన ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

8 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో 13 కోట్లకు మించి వసూళ్లు సాధించింది. ఈ అద్బుత చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అయ్యింది.

తాజాగా నిర్మాత అశ్వినీదత్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ చేస్తానంటూ ప్రకటించడంతో అప్పుడే ఆ సీక్వెల్‌ గురించిన చర్చ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరియు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...

అటు జగన్, ఇటు చంద్రబాబు ఇరకాటంలో పడ్డట్టేనా?

లాక్ డౌన్-4 మార్గదర్శకాలను ప్రకటించడానికి తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడటానికి వస్తున్నారనగానే.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఏం మాట్లాడతారన్నదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వివాదంపై ఎక్కువ స్పందించనంటూనే చాలా...

క్రైమ్ న్యూస్: కూలీ భార్యపై కాంట్రాక్టర్ రేప్ అటెంప్ట్.. ఆమె ఏం చేసిందంటే..

లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ...

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...