Switch to English

హోమ్ సినిమా సుడిగాలి సుధీర్ '3 మంకీస్' మూవీ రివ్యూ

సుడిగాలి సుధీర్ ‘3 మంకీస్’ మూవీ రివ్యూ

నటీనటులు: సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కారుణ్య చౌదరి..
నిర్మాత: జి నాగేష్
దర్శకత్వం: జి. అనీల్ కుమార్
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
మ్యూజిక్: సన్నీ దోమల
ఎడిటర్‌: డి. ఉదయ్ కుమార్
రన్ టైం: 2 గంటల 11 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 07, 2020

టెలివిజన్ షో ‘జబర్దస్త్’ షో ద్వారా బాగా పాపులర్ అయిన బెస్ట్ ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్ – గెటప్ శ్రీను – రామ్ ప్రసాద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘3 మంకీస్’. ఎమోషనల్ అడల్ట్ కంటెంట్ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి జి. అనీల్ కుమార్ డైరెక్టర్. సినిమాకంటే ఎక్కువగా ప్రమోషన్స్ కి బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేసిన ఈ ‘3 మంకీస్’ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

సంతోష్(సుడిగాలి సుధీర్), ఫణి(గెటప్ శ్రీను), ఆనంద్(రామ్ ప్రసాద్)లు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీరి ముగ్గురు రకరకాల జాబ్స్ చేసుకుంటూ అక్కడి అమ్మాయిలకు లైన్ వేస్తుంటారు. మొదటగా సంతోష్ కి తన బాస్ వైఫ్ పడిపోతుంది, ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అక్కడే తెలుస్తుంది సంతోష్ కి మ్యాటర్ లేదని(ఎరెక్టైల్ డిస్ ఫంక్షన్), ఆ తర్వాత డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ముగ్గురు కలిసి ఒక వేశ్య అయినా కారుణ్య చౌదరిని బుక్ చేసుకుంటారు. కట్ చేస్తే వేళ్ళు ఏమీ చేయకముందే కారుణ్యచనిపోతుంది. ఇక అక్కడి నుంచి ఆ చేయడం కోసం ఆ ముగ్గురు పడ్డ ఇబ్బందులేమిటి? మధ్యలో పోలీసులకి దొరికారా? దొరికితే ఆ పోలీసోడి నుంచి ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశారు? అసలు కారుణ్య ఎందుకు చనిపోయింది? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా..

తెర మీద స్టార్స్..

ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ కామెడీతోనే కాకుండా ఎమోషనల్ కంటెంట్ కూడా బాగా చేయగల నటుడని ప్రూవ్ చేసుకున్నాడు. ముగ్గురి మీద సుధీర్ కి ఎక్కువ మర్క్స్ పడతాయి. గెటప్ శ్రీను కూడా బాగా చేసాడు. రామ్ ప్రసాద్ తనదైన పంచ్ లతో మెప్పించాడు. నటన పరంగా ఈ ముగ్గురు గుడ్ అనిపించుకున్నారు. కారుణ్య చిన్న రోల్ చేసింది, ఉన్నంతలో ఓకే. ఇక ఆన్ స్క్రీన్ పరంగా అక్కడక్కడా అడల్ట్ కంటెంట్ మరియు కామెడీ సీన్స్ ముందు బెంచ్ వారిని కూసింత ఉత్తేజపరుస్తాయి.

తెర వెనుక టాలెంట్..

తెరవెనుక పనిచేసే డిపార్ట్మెంట్స్ లో ఒక్కటంటే ఒక్కదాని గురించి కూడా చెప్పుకునేలా లేకపోవడం బాధాకరం… ఒక్కో డిపార్ట్మెంట్ గురించి చెప్పటప్పుడు కొన్ని పదాలు అటు ఇటు దొర్లచ్చు, వారు హర్ట్ అవ్వచ్చు.. సో అందుకే అన్ని డిపార్ట్ మెంట్స్ కలిసి ది వరస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాయని చెప్పి ముగిస్తున్నాను.

విజిల్ మోమెంట్స్:

– ఏమన్నా ఉంటేగా చెప్పడానికి..!

బోరింగ్ మోమెంట్స్:

– లీడ్ యాక్టర్స్ ని వదిలేస్తే మిగతా అన్నీ నెగటివ్స్

విశ్లేషణ:

‘3 మంకీస్’ అని టైటిల్ పెట్టారు, అదీ కాక బుల్లితెరపై తెగ నవ్వించే సుడిగాలి సుధీర్ – గెటప్ శ్రీను – రామ్ ప్రసాద్ లు హీరోలుగా చేశారు అంటే సినిమా హాయిగా నవ్వుకునేలా ఉంటుందనుకొని థియేటర్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తలలు పట్టుకొని ఇదేం సినిమారా బాబు అనుకుంటూ బయటకి వస్తారు. పిచ్చోడి చేతికి స్టీరింగ్ ఇస్తే ఎలా పడితే అలా తిప్పినట్టు, డైరెక్టర్ అనిల్ కుమార్ కథని ఉన్న మూడ్ ని బట్టి, గుర్తొచ్చిన సినిమాలని బట్టి రాసుకుంటూ పోయి చూసే ఆడియన్స్ కి పిచ్చెక్కేలా చేసాడు. ఓవరాల్ గా పూర్తిగా డిజప్పాయింట్ చేసే సినిమా ‘3 మంకీస్’.

ఇంటర్వల్ మోమెంట్: సెకండాఫ్ చూడకుండా పారిపోతే బాగుండు.!

ఎండ్ మోమెంట్: ఛీ దీనెమ్మా, ఈ వారం కూడా మరో 150 లాస్..!

చూడాలా? వద్దా?: సేవ్ మనీ అండ్ సేవ్ టైం.!

బాక్స్ ఆఫీస్ రేంజ్:

ఏదో జబర్దస్త్ లో బాగా పరిచయం ఉన్న ముఖాలు, ప్రమోషన్స్ బాగా చెయ్యడంతో మార్నింగ్ షో కి జనాలు కనపడ్డారు.. పొరపాటున మాట్నీకి ఉన్నా ఈవెనింగ్ షోస్ కి మాత్రం ఖాళీ అయిపోతాయి. పెట్టింది రావడం చాలా కష్టం.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 1/5

సినిమా

ఆర్జీవీ కరోనా పాట : వైరస్ కంటే భయంకరం

పబ్లిసిటీ, అటెంషన్ సీకింగ్ అనేవి వైరస్ కంటే భయానకమైనవి. ఈ మత్తులో పడిపోతే ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందుకే...

పవన్ కళ్యాణ్ సరసన శ్రీదేవి ఖరారైనట్టేనా!

కరోనా అనే మహమ్మారి వలన దేశమంతా లాక్ డౌన్.. దాంతో షూటింగ్స్, సినేమానా ఆఫీస్ లు బంద్ అయ్యాయి. కానీ రచయితలూ, దర్శకులు మాత్రం ఇంట్లో...

చిరు ఇన్వాల్వ్‌ అవ్వడం వల్ల బాలయ్య, మోహన్‌బాబులు సైలెంట్‌ అయ్యారా?

ఈ కరోనా విపత్తు సమయంలో టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్స్‌ తమ మంచి మనసును చాటుకుని భారీ విరాళాలను ప్రకటించిన విషయం తెల్సిందే. సీఎం పీఎం...

లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఈనెలలో రామంటున్న హీరోలు

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌కు ముందు నుండే థియేటర్లు బంద్‌ అయ్యాయి. షూటింగ్స్‌ ఆగిపోవడంతో పాటు సినిమాల విడుదల...

రౌడీ స్టార్‌కు ఫ్యాన్స్‌ బాసట

టాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు కరోనా విపత్తు నేపథ్యంలో లక్షలు.. కోట్ల విరాళంను తమకు తోచినంతగా ఇచ్చిన విషయం తెల్సిందే. పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ తెలుగు రాష్ట్రాల...

రాజకీయం

వెనుదిరిగిన హోం మినిస్టర్‌: అసలేం జరిగింది.?

తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసేందుకు ప్రగతి భవన్‌కి వెళ్ళేందుకు ప్రయత్నించారుగానీ, ప్రగతి భవన్‌ గేటు నుంచే వెనుదిరగాల్సి వచ్చింది. ‘ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతోనే మొహమూద్‌ అలీ వెనుదిరిగారు’...

తెలుగు రాష్ట్రాల్లో డబుల్‌ సెంచరీ: కరోనా విలయమిది.!

‘ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు.. అదే సమయంలో అప్రమత్తంగా వుండాల్సిందే.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు భరోసా ఇస్తూనే, కరోనా పట్ల స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తోంటే,...

కరోనా వైరస్‌: చిన్న విషయమా వైఎస్‌ జగన్‌.?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 10 లక్షలకు చేరువవుతోంది.. ఈ మహమ్మారి దెబ్బకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 50 వేలకు చేరుకుంటోంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ దెబ్బకి...

‘లాక్‌డౌన్‌’ని లెక్కచేయని జనం.. మోడీ నెక్స్‌ట్‌ స్టెప్‌ ఏంటి.?

క్రమక్రమంగా దేశంలో లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌ తగ్గుతూ వస్తోంది. జనం రోడ్ల మీదకు చాలా ఎక్కువగానే వచ్చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతలా హెచ్చరిస్తున్నా, జనంలో మార్పు రావడంలేదు. ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.....

జీతాల కోత: రెండు రాష్ట్రాలు.. రెండు కోణాలు

కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. మరుసటి...

ఎక్కువ చదివినవి

రంగ్‌దే ఫస్ట్‌లుక్‌ : రొమాంటిక్‌ అను అండ్‌ అర్జున్‌

యంగ్‌ హీరో నితిన్‌ ఇటీవలే భీష్మ చిత్రంతో హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. చాలా రోజుల తర్వాత సక్సెస్‌ను దక్కించుకున్న నితిన్‌ అదే జోరులో రంగ్‌ దే చిత్రాన్ని ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల...

కన్నీరు పెట్టుకున్న జబర్దస్త్‌ యాంకర్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పేద వారు తిండి లేక అల్లాడి పోతున్నారు. కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్యతో సమానంగా త్వరలోనే ఆకలి చావులు కూడా ఉంటాయేమో అనే ఆందోళన...

పోలీసులపై నోరు జారిన హీరోయిన్‌

దేశంలో లాక్‌ డౌన్‌ విధించినా కర్ఫ్యూ విధించినా కూడా జనాలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. కరోనాను అరికట్టేందుకు బయటకు రావద్దంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా కూడా జనాలు మాత్రం వినడం లేదు....

సిసిసి కోసం లాక్ డౌన్ టైంలోనూ షూట్లో పాల్గొన్న స్టార్స్

ప్రస్తుతం కరోనా అనే మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చైనా, ఇటలీ, అమెరికా లాంటి దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. చాలా వేగంగా ప్రబలుతున్న ఈ కరోనానికి అరికట్టడానికి భారత ప్రభుత్వం...

ఏంటి వర్మ దీన్ని కూడా రచ్చ చేయాలా?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్‌ చేయడం లేదా ట్వీట్స్‌ చేయడం చేస్తూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో ఆయన...