హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా 3 Keyz Spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గణపతి ఈ రెస్టారెంట్‌ను స్థాపించారు.
ఈ ప్రారంభోత్సవానికి హీరో ఆకాష్ పూరి, సాయి రోనక్, దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ, చిన్నారి వీరుడు ‘చోటా భీమ్’ నిర్మాత రాజీవ్ చిలక, నటుడు అజయ్ ఘోష్, సమీర్, తగుబోతు రమేష్, బెజవాడ బేబక్క, హీరోయిన్ మదులగ్న దాస్, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 3 Keyz Spice ఫౌండర్ మరియు CEO రామ్ గణపతి మాట్లాడుతూ – “కాఫీ నుండి బిర్యానీ వరకు అన్ని రకాల కాంటినెంటల్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. సినిమా స్టోరీ డిస్కషన్‌కి అనువైన వాతావరణాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, సినీ కళాకారులు అందరికీ గచ్చిబౌలి వంటి ప్రైమ్ ఏరియాలో మంచి అనుభవం కలిగించేలా మా కాఫీ లాంజ్ సిద్ధంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు” అన్నారు.
