ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్.. సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాపులు/ వివిధ ట్రేడుల్లో 2424 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై క్లస్టర్ లో 1594 ఖాళీలు, భూసావల్ క్లస్టర్ లో 418, పూణె క్లస్టర్ లో 192, నాగ్ పూర్ క్లస్టర్ లో 111, షోలాపూర్ క్లస్టర్ లో 76 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటినెన్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రాం అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్ ట్రేడుల్లో ఖాళీలను గుర్తించారు.
కనీసం 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ పాసై ఉండాలి.
15.07.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
మెట్రిక్యులేషన్, ఐటిఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ. 100 కాగా, 15 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.