తెలుగు దేశం పార్టీ నలభై వసంతాల వేడుకలు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. భవిష్యత్తులో పార్టీ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువత కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్ల ను యువతకు కేటాయించబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సమయంలో యువత ముందుకు వచ్చి పార్టీ కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సమాజ హితం కోరుకునే వారు… ప్రజలకు సేవ చేయడం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లోకి కొత్త రక్తం వచ్చినప్పుడే సరి కొత్త మార్పు వస్తుందని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను సృష్టించడం లో చంద్రబాబు నాయుడు, టిడిపి ఖచ్చితంగా ముందు ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.