కేవలం రెండు వేల కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ వైఎస్ షర్మిల కోరారా.? ఔనా.? ఇది నిజమేనా.? అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ప్రబోదానుసారం ‘సగం ఆస్తి’ని కోరుతున్న వైఎస్ షర్మిల, జస్ట్ 2 వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సంప్రదిస్తారా.?
కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.! గడచిన పదేళ్ళలో డివిడెండ్ రూపంలోనే 200 కోట్లు ఇచ్చినట్లు స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. దీంతోపాటుగా, కొన్ని ఆస్తులు కూడా షర్మిలకి ఇచ్చినట్లు జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. కంపెనీల్లో వాటాల వంటివి మళ్ళీ ఎక్స్‌ట్రా.! ఆ వాటాల్ని వెనక్కి తీసుకోవాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. ఇదే విషయమై తల్లినీ, చెల్లినీ కోర్టుకు లాగారు జగన్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించి పెట్టిన ఆస్తులెన్ని.? వాటిని కొడుకు, కూతురు పంచుకోవడంలో తలెత్తిన వివాదం సంగతేంటి.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. వైఎస్ జగన్ మీద, ‘లక్ష కోట్ల అక్రమాస్తుల’ ఆరోపణలున్నాయి. ‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు’ అనేది ఆ ఆరోపణల సారాంశం.
మరి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయన స్వయంగా కూడేసిన ఆస్తులు ఇంకే స్థాయిలో వుండి వుండాలి.? ఆరోపణల సంగతి పక్కన పెడితే, వైఎస్సార్ సన్నిహితులు ఆఫ్ ది రికార్డుగా చెప్పే మాటల్ని బట్టే, ఇది వేల కోట్ల వ్యవహారం కాదు.. లక్షల కోట్ల వ్యవహారం.. అని ఇట్టే అర్థమయిపోతుంటుంది.
సో, కేవలం 2 వేల కోట్ల రూపాయల కోసం వైఎస్ షర్మిల కక్కుర్తి పడతారని అనుకోలేం. కానీ, వైసీపీ అను‘కుల’ మీడియా, ఇదే పిచ్చి వార్తని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ‘అక్రమాస్తులు’ అన్న ప్రస్తావన రాదన్నది బహుశా ఆ వైసీపీ అను‘కుల’ మీడియా కక్కుర్తి.
షర్మిల 2 వేల కోట్లు అడిగారు.. అంటూ, సోకాల్డ్ ‘కుల’ మీడియాలో వెకిలి రాతలు వస్తున్నాయంటే, ఆ రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరో బ్రోకర్ వుండి వుండాలి. ఆ బ్రోకర్ ద్వారా ఈ వార్తల్ని వైసీపీనే తెరపైకి తెచ్చి వుండాలి. ఇంతకీ, ఆ బ్రోకర్ ఎవరు.? ఇదిప్పుడు ఇంకో హాట్ టాపిక్.
చిన్నా చితకా వ్యవహారం కాదు.. ఐదారు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పంపకాలకు సంబంధించిన రచ్చ ఇది.. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే తప్ప.. లెక్కలు తేలవు.. అని తెలుగు రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్నారు.
2024 ఎన్నికల సమయంలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభల ‘రిచ్‌నెస్’ చూస్తేనే.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏ స్థాయిలో ఖర్చు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఖర్చు ముందర షర్మిల అడిగిందని చెబుతున్న 2 వేల కోట్లు.. జస్ట్ జుజుబీ అంతే.! షర్మిల అదే అడిగితే, ఇచ్చేసి చేతులు దులిపేసుకుని, ఏనాడో జగన్ విషయాన్ని సెటిల్ చేసేసుకునేవారేనేమో.! విషయం దానికంటే చాలా చాలా పెద్దది కాబట్టే, ఇంత పెద్ద పంచాయితీ.!
ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో ఏమో.!