Switch to English

20 లక్షల కోట్లు – ఆత్మ నిర్భర్‌ భారత్‌: అంకెలు బాగున్నాయ్‌గానీ.!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో ప్రకటించిన విషయం విదితమే. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తి వివరాలు ప్రకటిస్తారని మోడీ చెప్పారు.

తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, మీడియా ముందుకొచ్చి.. 20 లక్షల ప్యాకేజీకి సంబంధించి కొంత భాగం తాలూకు వివరాల్ని వెల్లడించారు. ముందు ముందు మరిన్ని లెక్కలు బయటకొస్తాయ్‌ గనుక.. ఇప్పుడు వచ్చిన లెక్కలతోనే పూర్తిగా ఈ ప్యాకేజీని సమర్థించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేని పరిస్థితి.

టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం తగ్గింపు ఖచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ట్యాక్స్‌ రిటర్న్‌ల గడువు పొడిగింపు కూడా ఆహ్వానించదగ్గ అంశంగానే పరిగణించాలి. పనిని బట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తామనడం, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణాల కాల పరిమితి 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం, డిస్కమ్ ల కోసం 90 వేల కోట్ల నిధులు కేటాయించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం వంటివన్నీ అభినందించదగ్గ అంశాలే.

అయితే, వీటి వల్ల సామాన్యుడికి డైరెక్ట్‌గా ఒరిగేదేంటి.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కార్మికుల్నే తీసుకుంటే, కార్మికులుగా గుర్తింపు పొందినవారికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం వుంటుంది. కానీ, కార్మికులుగా గుర్తింపు లేని వలస కార్మికుల మాటేమిటి.? ప్రతి ఒక్కరికీ మేలు చేకూరేలా ఈ ప్యాకేజీ.. అని కేంద్రం చెబుతున్నా, ఆ ‘అందరికీ’ అన్న మాటల్లో స్పష్టత మాత్రం కన్పించడంలేదు.

నిజానికి, బడ్జెట్‌ సమయంలో ప్రతిసారీ ఈ తరహా అంకెల గారడీ గురించి వింటుంటాం. కానీ, సామాన్యుడి చేతికి అందేదెంత.? అన్న విషయానికొచ్చేసరికి.. అందడం సంగతెలా వున్నా, జేబుకి చిల్లు మాత్రం పెరిగిపోతూ వస్తోంది. అయితే, రానున్న రోజుల్లో మరిన్ని ప్రకటనలు కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రాబోతున్నాయి. వాటిల్లో అయినా సామాన్యుడికి ఊరట కలుగుతుందా.? లేదంటే, అక్కడా అంకెల గారడీ చేస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...

త్వరలోనే విజయవాడకు జనసేనాని – దూకుడుగా వెళ్లడమే మంత్రం.!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా తనదైన తరహాలో సాయం చేస్తున్నారు. ఇక జనసైనికులైతే గ్రామ స్థాయిలో...

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

భార్య-బావమరిదిపై అనుమానం.. భర్త ఏం చేసాడంటే..?

కట్టుకున్న భార్య, సొంత బావమరిదిపై అనుమానం పెనుభూతంగా మారడంతో సొంత బావమరిదిని బావ హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది....