Radhe Krishna: ఎస్.ఎస్.సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘1980లో రాధేకృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ఎస్వి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఊడుగు సుధాకర్ నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు బంజారా భాషలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అతిథులుగా నిర్మాతలు రామ్ తాళ్లూరి, బెక్కం వేణుగోపాల్, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ హాజరై సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
నిర్మాత ఊడుగు సుధాకర్.. ‘మంచి కథాంశం కావడంతో బడ్జెట్ పరిమితులు చూసుకోకుండా సినిమాను భారీగా తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరించి సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
హీరో సైదులు.. ‘సినిమా కోసం కష్టపడిన మా టీమ్ కి ధన్యవాదాలు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మంచి సర్ప్రైజ్ ఇస్తాం. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకముంద’ని అన్నారు.
దర్శకుడు ఇస్మాయిల్ షేక్.. తనికెళ్ల భరణిగారి వాయిస్ ఓవర్ టీజర్ కి ప్లస్. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు క్లైమాక్స్ కి చేసిన సజెషన్స్ హెల్ప్ అయ్యాయి. ప్రేక్షకులందరూ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.